Site icon HashtagU Telugu

Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇతర దేశాల జోక్యం.. ఇండియా సమాధానమిదే

Arvind Kejriwal

Arvind Kejriwal

Kejriwal: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టుపై ఇతర దేశాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. జర్మనీ అమెరికా దేశాలు అరెస్టును తప్పు పట్టాయి. భారత్‌లోని ప్రతిపక్ష నేత అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయని భారత్‌ ఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. ఇందులో కచ్చితమైన, సమయానుకూల ఫలితాలు వస్తాయని, అంచనాలు తగదని తేల్చి చెప్పింది. జర్మనీ విదేశాంగశాఖ కూడా ఇదే తరహాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ న్యాయపరమైన, నిష్పాక్షికమైన విచారణకు అర్హుడని, అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గాలను ఎలాంటి పరిమితులు లేకుండా ఆయన వినియోగించుకోవచ్చని ఆ ప్రకటనలో ఉంది. ఇక అమెరికా రాయబార కార్యాలయం తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనా సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. అరగంట పాటు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది.