International Yoga Day: ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం. 5 వేల సంవత్సరాల క్రితమే యోగా భారతదేశంలో ఉద్భవించింది. కాలచక్రంలో యోగా దేశదేశాలకు దావానలంలా వ్యాపించింది.
యోగా చేయడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. దీంతో పాటు మానసిక, శారీరక సమస్యలు దూరమవుతాయి. భారతదేశంలో ప్రాచీన కాలం నుండి యోగా ఆచరణలో ఉన్నది. ప్రస్తుతం పాశ్చాత్య నాగరికత ప్రజలు కూడా యోగాను అవలంబిస్తున్నారు. మత గ్రంథాలలో కూడా యోగా ప్రస్తావన ఉంది. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు తన పరమ శిష్యుడైన అర్జునుడికి గీతను బోధించే సమయంలో యోగా యొక్క నియమాలు మరియు రకాలు గురించి వివరిస్తాడు.
దేశంలో యోగాపై ప్రధాని మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారు. నిజానికి మోడీ యోగాకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. మోడీ చొరవతో యోగా మరింత ప్రసిద్ధి చెందింది. అయితే ప్రస్తుతం ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 180కి పైగా దేశాలతో యోగా చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నారు.
Read More: Yuvagalam : యువగళంలో అన్నీ తానై.. సొంత జిల్లాలో యాత్రకు దూరమైన నేత.. కారణం ఇదేనా..?