Site icon HashtagU Telugu

Putin Vs Suspicious Deaths : పుతిన్ ప్రత్యర్ధుల మిస్టరీ మరణాల చిట్టా ఇదిగో

Putin Vs Suspicious Deaths

Putin Vs Suspicious Deaths

Putin Vs Suspicious Deaths :  పుతిన్ రాజకీయ ప్రత్యర్ధి,  రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ అనుమానాస్పద  మృతిపై యావత్ ప్రపంచంలో చర్చ నడుస్తోంది.  ఈ మరణానికి పుతినే కారణమని నావల్నీ భార్య, మద్దతుదారులు సహా అమెరికా, కెనడాలు ఆరోపిస్తున్నాయి. రష్యాలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వరుసగా ప్రాణాలు కోల్పోవడం మిస్టరీగా మారింది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి పుతిన్‌ రాజకీయ ప్రత్యర్ధుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా అధికారులు వీటిని ఆత్మహత్యలు, ప్రమాదాలుగా ప్రభుత్వ నివేదికల్లో, ప్రభుత్వ మీడియాల్లో చూపిస్తున్నారు.  పుతిన్‌ హయాంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన పలువురు ప్రముఖుల(Putin Vs Suspicious Deaths) వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

We’re now on WhatsApp. Click to Join

విపక్ష గొంతుక.. అలెక్సీ నావల్నీ

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మూడు రోజుల క్రితం ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీ జైలులో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ‘సడెన్‌ డెత్‌ సిండ్రోమ్‌’ వల్లే ఆయన మృతిచెందారని అంటున్నారు. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా గుండెపోటుతో ఆకస్మిక మరణానికి దారితీసే స్థితిని ఈ విధంగా వ్యవహరిస్తారు. మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన మరణవార్తను అధికారికంగా తెలిసిన వెంటనే ఆర్కిటిక్‌ పీనల్‌ కాలనీలో ఉన్న జైలుకు ఆమె వెళ్లారు. కానీ, అప్పటికే మృతదేహాన్ని సమీపంలోని సలేఖార్డ్‌ నగరానికి తరలించినట్లు చెప్పారు. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ప్రాథమిక శవపరీక్షలో ఎలాంటి ఫలితం తేలలేదని.. రెండోసారి చేయాల్సి ఉంటుందని అక్కడి అధికారులు చెప్పినట్లు నావల్నీ అధికార ప్రతినిధి కీరా యార్మిష్‌ వెల్లడించారు. నావల్నీ మృతదేహాన్ని కావాలనే దాచిపెడుతున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మరణానికి దారితీసిన అవశేషాలను శరీరంలో నుంచి తుడిచిపెట్టాలనే అలా చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. నావల్నీకి నివాళులర్పించిన దాదాపు 100 మందిని రష్యా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నావల్నీ మృతిపై అమెరికా, యూకే, కెనడా సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. దీని వెనుక అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందని ఆరోపించాయి.

వాగ్నర్ గ్రూప్ సారథి..  ప్రిగోజిన్‌

రష్యాలో పుతిన్ తయారు చేసిన ప్రైవేటు ఆర్మీ  పేరు ‘వాగ్నర్ గ్రూప్’. ఈ ప్రైవేటు ఆర్మీకి చీఫ్‌గా ప్రిగోజిన్‌ వ్యవహరించేవాడు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో అతడే కీలక పాత్ర పోషించాడు. గతేడాది చివర్లో పుతిన్‌పై ప్రిగోజిన్‌ తిరుగుబాటు చేశాడు. ఆ తర్వాత పుతిన్‌తో డీల్ చేసుకొని  బెలారస్‌‌కు వలస వెళ్లాడు. పుతిన్‌, ప్రిగోజిన్‌ మధ్య గొడవ సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే (గతేడాది చివర్లో) ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతడు ప్రయాణిస్తున్న విమానంలోని పైలట్లు, బాడీగార్డ్స్  కూడా మరణించారు.

Also Read :BSP – INDIA : అఖిలేష్‌కు షాక్.. ‘ఇండియా’లోకి బీఎస్పీ.. కాంగ్రెస్ బడా స్కెచ్

సెక్యూరిటీ ఏజెంట్.. అలెగ్జాండర్‌ లిట్వినెంకో

అలెగ్జాండర్‌ రష్యన్‌ ఫెడరల్‌ సెక్యూరిటీ ఏజెంట్‌గా పనిచేసేవారు. 1999 మాస్కో అపార్ట్‌మెంట్‌ బాంబు దాడులకు పుతిన్‌ కారణమని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని అలెగ్జాండర్ ప్రశ్నించేవారు. 2006లో లండన్‌లో ఇద్దరు రష్యన్‌ ఏజెంట్లతో కలిసి టీ తాగిన తర్వాత ఆయన చనిపోయారు. అలెగ్జాండర్‌ తాగిన టీలో విషం కలిపారనే వాదనలు ఆనాడు చక్కర్లు కొట్టాయి.

మాజీ ప్రధాని.. బోరిస్‌ నెమత్సోవ్‌

రష్యా ప్రధానిగా పనిచేసిన బోరిస్‌పై 2015లో క్రెమ్లిన్‌ దగ్గర్లోని మాస్కో వంతెన వద్ద కొంతమంది కాల్పులు జరపడంతో చనిపోయారు.  ఈ ఘటనలో చెచెన్‌కు చెందిన ఐదుగురిని రష్యా భద్రతా బలగాలు అరెస్టు చేశాయి.  ఈ హత్య చేసేందుకు ఎవరు ప్లాన్ చేశారనేది మాత్రం బయటికి రాలేదు. 2014లో క్రిమియాను ఉక్రెయిన్‌ నుంచి రష్యా స్వాధీనం చేసుకోవడంపై ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనల్లో బోరిస్‌ పాల్గొన్నారు. పుతిన్‌ నిర్ణయాలపై బోరిస్ విమర్శలు కూడా చేశారు. ఇందువల్లే హత్య జరిగిందని అంటున్నారు.

జర్నలిస్ట్.. అన్నా పొలిట్‌కోవ్‌స్కాయ

అన్నా పొలిట్‌కోవ్‌స్కాయ రష్యన్‌ జర్నలిస్ట్‌. ఆమెను 2006లో కొందరు దుండగులు ఇంట్లోనే హత్య చేశారు. ఈమె పుతిన్, చెచెన్ నాయకుడు రంజాన్ కదిరోవ్‌లపై విమర్శలు చేసేవారు. అన్నా మృతి తర్వాత రష్యాలో ప్రతికా స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తమైంది.

Also Read : PhD At 89 Years : 89 ఏళ్ల ఏజ్‌లో పీహెచ్‌డీ.. పెద్దాయన కొత్త రికార్డు

Exit mobile version