అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ( Los Angeles)లోని డిటెన్షన్ సెంటర్ సమీపంలో ఇమ్మిగ్రేషన్ రైడ్స్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. ఫెడరల్ పోలీసులతో నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదేశాలతో సుమారు 300 మంది నేషనల్ గార్డ్ సభ్యులను రంగంలోకి దించారు. పెంటగాన్ చీఫ్ పీటర్ హెగ్సెత్ తీవ్ర హెచ్చరికలతో సహా, అవసరమైతే యాక్టివ్ డ్యూటీ సైనికులను కూడా పంపే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Health Tips : పాప్ కార్న్ vs అరటిపండు చిప్స్.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఈ నిర్ణయం కేలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ ఆమోదం లేకుండానే తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత దశాబ్దాలుగా గవర్నర్ అభ్యర్థన లేకుండానే జాతీయ రక్షక దళాన్ని పంపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గవర్నర్ న్యూసమ్ ట్రంప్ చర్యలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే ప్రకటనగా అభివర్ణించారు. అదే సమయంలో రాష్ట్ర పన్నుల రూపంలో తమదే ఎక్కువ ఖర్చు ఫెడరల్ ప్రభుత్వానికి వస్తోందని, అవసరమైతే పన్నుల పంపిణీ ఆపుతామని హెచ్చరించారు. ఇప్పటికే నగరంలోని హోమ్ డిపో స్టోర్లు, గార్మెంట్ ఫ్యాక్టరీలు, వేర్‌హౌస్‌ల వద్ద ప్రభుత్వ అధికారులు దాడులు జరిపారు. వీటిపై స్పందించిన లాస్ ఏంజెల్స్ మేయర్ కెరెన్ బాస్, ఈ చర్యలు ప్రజలలో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.
“ఇవి మన నగరంలో భద్రతకు విరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి చర్యలను మేము సహించము” అని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనలపై అసిస్టెంట్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ ట్రిషా మెక్లాఫ్లిన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలను ప్రమాదకరమైన అక్రమ వలసదారుల కోసం పోరాడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి.