Site icon HashtagU Telugu

23 Deaths : ఎగిసిపడిన అగ్నిపర్వత లావా.. మరో 12 మంది సజీవ దహనం

Volcano Eruption

Volcano Eruption

23 Deaths : 2,620 అడుగుల ఎత్తుకు గాల్లోకి బూడిదను వెదజల్లుతూ పేలిన ఇండోనేషియా అగ్నిపర్వతం మౌంట్ మరాపి ఎంతోమందిని బలితీసుకుంది. శనివారం రోజు ఈ అగ్నిపర్వత పేలుడు సంభవించిన టైంలో దానిపై ఉన్న 26 మంది పర్వతారోహకుల్లో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. అగ్నిపర్వత లావా, వేడివేడి బూడిద రాశులు వచ్చి మీద పడటంతో వారంతా సజీవ దహనమయ్యారు. ఇక తీవ్రంగా కాలిన గాయాలైన పలువురిని హుటాహుటిన ఆస్పత్రుల్లో చేర్పించగా చికిత్సపొందుతున్నారు. 12 మంది ఆచూకీ గల్లంతైందని ఆ రోజున అధికారులు ప్రకటించారు. తాజాగా 12 మంది  డెడ్‌బాడీస్‌ మౌంట్ మరాపి అగ్నిపర్వతం పరిసరాల్లో లభ్యమయ్యాయి.  దీంతో ఇప్పటివరకు చనిపోయిన పర్వతారోహకుల సంఖ్య 23కు పెరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

సోమవారం రోజు కూడా మరోసారి అగ్నిపర్వతం పేలిందని పరిసర ప్రాంతాల ప్రజలు తెలిపారు. ఇప్పుడు దొరికిన డెడ్ బాడీస్ శనివారం రోజు మరణించిన వారివా ? సోమవారం జరిగిన పేలుడులో చనిపోయిన వారివా ? అనేది తెలియాల్సి ఉంది. శనివారం నుంచి మంగళవారం వరకు అగ్నిపర్వతంపై నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌లో దాదాపు 50 మంది పర్వతారోహకులను కాపాడామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంకా కొందరు గల్లంతయ్యారని, వారి ఆచూకీ కూడా త్వరలోనే దొరుకుతుందని తెలిపాయి.

Also Read: Tech Tips: మీ ఫోన్ లో బ్యాటరీ త్వరగా అయిపోతోందా.. అయితే ఈ చిన్న సెట్టింగ్స్ మారిస్తే చాలు?

మౌంట్ మరాపి అగ్నిపర్వతం పేలుడుతో వెలువడిన బూడిద రాశులు సమీప ప్రాంతాల్లోని రోడ్లు, ఇళ్లు, వాహనాలను కప్పేశాయి. ఈ బూడిద బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలకు అధికారులు మాస్కులు, అద్దాలు అందజేశారు. మౌంట్ మరాపి సమీపంలోని రుబాయి, గోబా కుమాంటియాంగ్‌ గ్రామాలకు చెందిన 1400 మందిని సురక్షిత ప్రాంతాలకు(23 Deaths) తరలించారు. అగ్నిపర్వతం సమీపంలోని ప్రాంతాల్లో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.