Site icon HashtagU Telugu

Indonesia violence: ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా ఘర్షణ…120 మందికిపైగా దుర్మరణం..!!

Indonesia

Indonesia

ఇండోనేషియాలో ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. AFP ప్రకారం, మ్యాచ్ సందర్భంగా జరిగిన హింసలో దాదాపు 127 మంది మరణించారు. వార్తా వెబ్‌సైట్ ది గార్డియన్ ప్రకారం, ఇండోనేషియా లీగ్ ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ తలెత్తిన ఘర్షణ వల్ల దాదాపు 127మంది పైగా ఫుట్ బాల్ అభిమానులు మరణించినట్లు తెలిపింది.

తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలో జరిగిన మ్యాచ్‌లో అరేమాను 3-2తో ఓడించిన తర్వాత జావానీస్ క్లబ్ అరెమా, పెర్సెబయ సురబయ మద్దతుదారులు ఘర్షణకు పాల్పడ్డారు. 127 మందికి పైగా మరణించారని మలాంగ్ రీజెన్సీ ఆరోగ్య కార్యాలయం తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యను అధికారులు ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. అదే సమయంలో, ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తొక్కిసలాట సమయంలో ఊపిరాడక చాలా మంది మరణించారని…ప్రమాదంలో దాదాపు వంద మందికిపైగా గాయపడ్డట్లు తెలిపింది.