Indonesia set to punish: ఇండోనేసియా మరో సంచలన నిర్ణయం

  • Written By:
  • Publish Date - December 7, 2022 / 09:00 AM IST

వివాహేతర సంబంధాలు, సహజీవనంపై ఇండోనేసియా (Indonesia) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటినీ నిషేధిస్తూ తీసుకొచ్చిన చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలిపింది. కొత్తచట్టం ప్రకారం వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణిస్తారు. ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అలాగే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే (సహజీవనం) ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. ఈ కొత్త చట్టాని(Indonesia set to punish)కి అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి.

ఇండోనేషియా (Indonesia) పార్లమెంట్ మంగళవారం కొత్త క్రిమినల్ చట్టాన్ని ఆమోదించింది. ఈ కొత్త చట్టం ప్రకారం వివాహేతర సంబంధాలు నిషేధం. దీన్ని ఉల్లంఘిస్తే ఏడాది జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నియమం ఇండోనేషియా పౌరులకు, దేశంలో నివసిస్తున్న విదేశీయులకు సమానంగా వర్తిస్తుంది. దీనితో పాటు వివాహం తర్వాత భాగస్వామితో కాకుండా ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకోవడంపై కూడా నిషేధం విధించబడింది. అయితే భార్యాభర్తలు లేదా పిల్లల ఫిర్యాదు తర్వాతే ఈ కేసులో పోలీసు చర్యలు తీసుకోవచ్చని చట్టంలో పేర్కొంది. కొత్త చట్టం ప్రకారం భార్యాభర్తలకు మాత్రమే శారీరక సంబంధాలు పెట్టుకునే హక్కు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వివాహిత లేదా అవివాహిత స్త్రీ లేదా పురుషుడు ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారు ఒక సంవత్సరం జైలుకు వెళ్లవలసి ఉంటుంది. దీంతో పాటు వారికి జరిమానా కూడా విధించవచ్చు.

అయితే.. ఒక మహిళ లేదా పురుషుడు వారి భాగస్వామి లేదా పెళ్లి కాని వారి తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసినప్పుడు ఈ విషయంలో చర్యలు తీసుకోబడతాయి. కోర్టులో విచారణకు ముందు ఫిర్యాదును ఉపసంహరించుకోవచ్చు. అయితే కోర్టులో విచారణ ప్రారంభమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో పాటు దేశ రాష్ట్రపతిని, ప్రభుత్వ సంస్థలను అవమానించడంపై కూడా నిషేధం విధించారు.

Also Read: Hackers: హాస్పిటల్స్‌ సర్వర్స్‌పై హ్యాకింగ్ పంజా

దాదాపు మూడేళ్ల క్రితమే ఇండోనేషియాలో ఈ చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే దీనికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లో నిరసనలు చేయడం ప్రారంభించారు. దీని కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గవలసి వచ్చింది. అప్పట్లో ఈ చట్టాన్ని ‘స్వేచ్ఛా స్వాతంత్య్రం’ ఉల్లంఘించడమేనని నిరసన వ్యక్తం చేశారు. ఇండోనేషియా డిప్యూటీ న్యాయ శాఖ మంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ దీనిపై మాట్లాడారు. ఈ నిర్ణయం ఇండోనేషియా విలువలను ప్రతిబింబిస్తోందని, అందుకు గర్విస్తున్నామని ఒమర్ షరీఫ్ అన్నారు.

పర్యాటకులను పెద్ద ఎత్తున స్వాగతించే ఇండోనేషియాలో ఈ ప్రతిపాదన చట్టంగా మారితే ఇండోనేషియా పౌరులకే కాకుండా ఇక్కడికి వచ్చే విదేశీయులకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ కారణంగా ఇండోనేషియాలోని అనేక వ్యాపార వర్గాలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య కేవలం పర్యాటక రంగాన్నే కాకుండా పెట్టుబడిదారులను కూడా ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.