Site icon HashtagU Telugu

Indonesia : మసీదులో అగ్నిప్రమాదం..కూలిపోయిన భారీ గోపురం..!!

Indonesia

Indonesia

ఇండోనేషియాలోని జకార్తా ఇస్లామిక్ సెంటర్ లోని మసీదులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మసీదు భారీ గోపురం పేటముక్కలా కూలిపోయింది. ఈ దృశ్యం చూసిన ప్రజలు తీవ్రభయాందోళన చెందారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. మంటలు వేగంగా వ్యాపించడంతో మసీదు గోపురం పూర్తిగా నేలమట్టమయ్యింది. గోపురం కూలిపోతున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. బలమైన గాలులు వీస్తుండటంతో మంటల ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఘటన స్థలంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.