Terror Plot To Attack Pope Francis : పోప్ ఫ్రాన్సిస్‌పై దాడికి ఉగ్ర కుట్ర.. భగ్నం చేసిన ఇండోనేషియా పోలీసులు

నిఘా వర్గాల నుంచి ఈ సమాచారం  అందడంతో అలర్ట్ అయిన ఇండోనేషియా పోలీసులు(Terror Plot To Attack Pope Francis) సెప్టెంబరు 2, 3 తేదీల్లో జకార్తా, బోగోర్, బెకాసీ, వెస్ట్ సుమత్రా, బంగ్కా బెలీటుంగ్ ఐలాండ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. 

Published By: HashtagU Telugu Desk
Pope Francis

Pope Francis

Terror Plot To Attack Pope Francis : ఐసిస్ ఉగ్రవాదులు ఏకంగా క్రైస్తవ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్‌పై దాడికి కుట్ర పన్నారు. వారి కుట్రను ఇండోనేషియా పోలీసులు భగ్నం చేశారు. ఈనెల 3 నుంచి 6 వరకు ఇండోనేషియాలో పోప్ ఫ్రాన్సిస్‌ పర్యటించారు. ఆ సందర్భంగా ఆయనపై దాడికి కొందరు ఉగ్రవాదులు పథక రచన చేశారు. నిఘా వర్గాల నుంచి ఈ సమాచారం  అందడంతో అలర్ట్ అయిన ఇండోనేషియా పోలీసులు(Terror Plot To Attack Pope Francis) సెప్టెంబరు 2, 3 తేదీల్లో జకార్తా, బోగోర్, బెకాసీ, వెస్ట్ సుమత్రా, బంగ్కా బెలీటుంగ్ ఐలాండ్ ప్రాంతాల్లో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read :Court Sentences Death Penalty: మైనర్ బాలికపై అత్యాచారం.. మ‌ర‌ణశిక్ష విధించిన కోర్టు.. ఎక్క‌డంటే..?

ఇటీవలే పోప్ ఫ్రాన్సిస్ ఇండోనేషియా, సింగపూర్ సహా ఆసియా-పసిఫిక్ దేశాల్లో 12 రోజుల పాటు పర్యటించారు. శుక్రవారం రోజే ఇండోనేషియాలో ఆయన పర్యటన ముగిసింది. పోప్‌పై దాడికి కుట్ర పన్నిన ఉగ్రవాదులను ప్రస్తుతం విచారిస్తున్నట్లు  ఇండోనేషియా అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన పథక రచన ఎలా జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపాయి. ఈక్రమంలో సదరు ఉగ్రవాదుల ఇళ్లపైనా రైడ్స్ జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోప్‌పై దాడి  చేసేందుకు డ్రోన్లు, బాణాలు, విల్లులను ఉగ్రవాదులు రెడీ చేసుకున్నట్లు గుర్తించామన్నారు. ఐసిస్‌కు సంబంధించిన కొన్ని కరపత్రాలను సీజ్ చేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.

Also Read :Drinking Water In Morning: ఉద‌యం నిద్ర లేవ‌గానే నీళ్లు తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

ఇటీవలే ఇండోనేషియా పర్యటనలో భాగంగా జకార్తా నగరంలోని ఇస్తిఖ్ లాల్ మసీదును సందర్శించారు. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో ఇదే అతిపెద్ద మసీదు. ఇవాళ పోప్ ఫ్రాన్సిస్ పపువా న్యూగినియా దేశంలో పర్యటిస్తున్నారు.ఆ దేశంలో అర్జెంటీనాకు చెందిన క్రైస్తవ మిషనరీలు అందిస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఈ పర్యటనలో భాగంగా పోప్ ఫ్రాన్సిస్ తెలుసుకోనున్నారు.  వారి సేవాభావాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Also Read :Burger House Viral : బర్గర్‌ ఇల్లు..భలేగా ఉందే..!!

  Last Updated: 08 Sep 2024, 12:26 PM IST