Site icon HashtagU Telugu

Operation Kaveri: ‘ఆపరేషన్ కావేరీ’

operation kaveri

New Web Story Copy (43)

Operation Kaveri: సుడాన్ లో తమ దేశ సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. వాహనాలు ధ్వంసమవుతున్నాయి. కొని చోట్ల పేలుళ్లు సంభవిస్తున్నాయి. దీంతో సుడాన్ లో ఉంటున్న విదేశీయులను తమ దేశానికి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. కాగా.. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ కావేరీ కొనసాగుతోంది. ఐఏఎఫ్ సీ-130జే విమానంలో భారతీయులను పోర్ట్ సూడాన్ నుంచి జెద్దాకు తీసుకువస్తున్నారు. సూడాన్ నుంచి ఇప్పటి వరకు 530 మంది భారతీయులను రప్పించగా.. భారత వాయుసేన అధికారులు దేశప్రజలకు అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ తరలింపులో భాగంగా ఓ సన్నివేశం అందరిని ఆకర్షించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గరుడ స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్ ఓ పసికందును ప్రేమగా తన చేతుల్లో పట్టుకుని తలపై చేయి వేసి విమానంలోకి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ ఎయిర్ ఫోర్స్ అధికారిపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సూడాన్ నుండి భారతీయులను తరలించడానికి భారతదేశం తన సైనిక విమానాలు మరియు యుద్ధనౌకలను మోహరించింది. పోర్ట్ సూడాన్ నుండి 135 మంది భారతీయులతో కూడిన మూడవ బ్యాచ్ IAF C-130J విమానంలో జెడ్డాకు చేరుకుంది. అంతకుముందు, సూడాన్‌లో చిక్కుకున్న 121 మంది భారతీయులతో కూడిన రెండవ బ్యాచ్ పోర్ట్ సూడాన్ నుండి IAF C-130J విమానంలో జెడ్డాకు బయలుదేరింది.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ట్వీట్ చేస్తూ… “సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు సౌదీ అరేబియా అధికారులకు పూర్తి సహకారం అందించినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. భారతీయులందరినీ త్వరలో భారత్‌కు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కాగా.. అధికారిక లెక్కల ప్రకారం సూడాన్ నుండి ఇప్పటివరకు 530 మంది భారతీయులను ఇండియాకు తరలించారు. ‘ఆపరేషన్ కావేరీ’ కింద భారతదేశం జెడ్డాలో రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. సూడాన్ నుండి భారతీయులందరినీ సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి తీసుకెళ్లారు. అక్కడి నుండి భారత్ కు తీసుకువస్తారు.

Read More: Kavya Kalyanram : రోజ్ స్కర్ట్ లో మెరిసిపోతున్న బలగం ఫేమ్ కావ్య కల్యాణ్రామ్