Suicide Game : భారత విద్యార్థిని బలిగొన్న ‘సూసైడ్ గేమ్’.. ఏమిటిది ?

Suicide Game : అమెరికాలో భారతీయుల మరణాలు ఆగడం లేదు. ఇందుకు వివిధ రకాల కారణాలు ఉన్నాయి.

  • Written By:
  • Updated On - April 20, 2024 / 10:08 AM IST

Suicide Game : అమెరికాలో భారతీయుల మరణాలు ఆగడం లేదు. ఇందుకు వివిధ రకాల కారణాలు ఉన్నాయి. భారతీయులపై అమెరికన్లు దాడి చేయడానికి ప్రధాన కారణంగా వర్ణ వివక్ష నిలుస్తోంది.  వ్యక్తిగత కక్షలను మరో కారణంగా చెప్పొచ్చు. కిడ్నాప్ ఉదంతాలు ఇంకో  కోణంగా ఉన్నాయి.  భారతీయుల మరణాలకు దారితీస్తున్న మరో మిస్టీరియస్ అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది.అదేంటో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

We’re now on WhatsApp. Click to Join

అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఫస్టియర్ చదువుతున్న 20 ఏళ్ల భారత విద్యార్థి ఈ ఏడాది మార్చి 8న అనుమానాస్పద స్థితిలో(Suicide Game) చనిపోయాడు. ఆ భారత విద్యార్థిని ఎవరో లూటీ చేసి, హత్య చేసి ఉంటారని అప్పట్లో అందరూ అనుకున్నారు. చివరకు పోలీసులు దర్యాప్తు చేశాక.. అసలు విషయం వెలుగుచూసింది. అదేమిటంటే.. ముక్కు పచ్చలారని ఆ కుర్రాడి మర్డర్‌లో  ఓ భయంకరమైన ఆన్‌లైన్ గేమ్ హస్తం ఉందని తేలింది.  ఆ డేంజరస్ గేమ్ పేరే.. ‘‘బ్లూ వేల్ ఛాలెంజ్’’. దీన్నే డెత్ గేమ్ అని కూడా పిలుస్తారు. ఈ గేమ్‌లో గుర్తు తెలియని అడ్మినిస్ట్రేటర్  నుంచి 50 రోజుల పాటు 50 టాస్క్‌లు ఇస్తారట. తొలుత ఈజీగా ఉండే టాస్క్‌లే అసైన్ చేస్తారట. క్రమంగా హార్డ్‌గా ఉంటే టాస్క్‌లు చేయమని చెబుతారు. అర్ధరాత్రి లేచి హారర్ మూవీలు చూడటం.. పెద్ద బిల్డింగ్ ఎక్కి అంచులో నిలబడటం వంటివి చేయమని బ్లూ వేల్ ఛాలెంజ్ అడ్మినిస్ట్రేటర్ నుంచి అసైన్‌మెంట్లు వస్తాయట. ఇవన్నీ చేస్తూ సాక్ష్యంగా ఫొటో లేదా వీడియో దిగి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మరో టాస్క్‌ను అసైన్ చేస్తారు.

లాస్ట్ టాస్క్.. సూసైడ్

ఈక్రమంలో చివరగా వచ్చే టాస్క్ ‘సూసైడ్’ అని అంటున్నారు.  కొందరికైతే గేమ్ మధ్యలోనే ఈ భయంకరమైన టాస్క్‌ను అసైన్  చేస్తుంటారట. గేమ్‌ అడ్మినిస్ట్రేటర్ నుంచి సూసైడ్ ఆర్డర్ వచ్చినందు వల్లే అమెరికాలోని మసాచుసెట్స్ యూనివర్సిటీలో చదువుతున్న భారత విద్యార్థి మార్చి 8న ఆత్మహత్య చేసుకున్నాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. రెండు నిమిషాలు ఊపిరి బిగబట్టమని గేమ్ అడ్మినిస్ట్రేటర్  నుంచి ఆర్డర్ వచ్చిందని.. గేమ్ మత్తులో మునిగిపోయి, ఆ ఆర్డర్‌ను ఫాలో అయిన భారత విద్యార్థి  చేతులారా ప్రాణాలు తీసుకున్నాడని అంటున్నారు.

Also Read : VASA 1 : ఫొటోలు, వీడియోలుగా మారుతాయ్.. విత్ ఎమోషన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ !

మన ఇండియాలో 10 మంది అలాగే.. 

ఇప్పటివరకు బయటికొచ్చిన వివరాల ఆధారంగా అమెరికా, భారత్, అర్జెంటీనా, రష్యా, బంగ్లాదేశ్‌లలో ‘‘బ్లూ వేల్ ఛాలెంజ్’’ బాధితులు ఉన్నారు. ఈ గేమ్‌కు బానిసగా మారిపోయి భారత్‌లో దాదాపు 10 మంది యువకులు సూసైడ్ చేసుకున్నారని ఐఐటీ ఢిల్లీ అధ్యయన నివేదిక పేర్కొంది. ఈ గేమ్‌తో ముడిపడిన  మొత్తం 170 సూసైడ్ కేసుల్లో ఎక్కువ భాగం అమెరికాలోనే జరిగాయని అంటున్నారు. సూసైడ్‌కు ప్రేరేపించేలా ఉన్న ఈ గేమ్‌ను బ్యాన్ చేయాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. రష్యాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న ఈ గేమ్‌ను బ్యాన్ చేసేందుకు ప్రపంచ దేశాలు డిజిటల్ యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది.