Site icon HashtagU Telugu

Indian Student Dies: ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. భారత విద్యార్థి దుర్మరణం

Mexico Bus Crash

Road accident

ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో జరిగిన కారు ప్రమాదంలో (Car Accident) 21 ఏళ్ల భారతీయ విద్యార్థి మరణించాడు. మీడియా నివేదికల ప్రకారం.. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాకు చెందిన కునాల్ చోప్రా ఉదయం 7 గంటలకు పని నుండి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో కాన్‌బెర్రాలోని విలియం హోవెల్ డ్రైవ్‌లో అతని కారు కాంక్రీట్ పంపింగ్ ట్రక్కును ఢీకొట్టింది. స్టూడెంట్ వీసాపై చోప్రా ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు. ఆస్ట్రేలియాలో బహుళ-సాంస్కృతిక, బహుభాషా ప్రసార సంస్థ అయిన SBS పంజాబీ దీనిని నివేదించింది. ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ ప్రమాదంలో చోప్రా అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రకటించారు. 2023లో కాన్‌బెర్రా ప్రాంతంలో ఇది మొదటి రోడ్డు ప్రమాదం.

Also Read: Temple in Australia: ఆస్ట్రేలియాలో హిందూ ఆలయంపై దాడి.. వారంలో ఇది రెండో ఘటన

చోప్రా ప్రమాదంపై మేజర్ కొలిషన్స్ టీమ్ దర్యాప్తు ప్రారంభించిందని రోడ్ పోలీసింగ్ యాక్టింగ్ ఇన్‌స్పెక్టర్ ట్రావిస్ మిల్స్ తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో చోప్రా ఆస్ట్రేలియా చేరుకున్నాడు. చోప్రా కజిన్ హనీ మల్హోత్రా కలిసి కాన్‌బెర్రాలో నివసిస్తున్నాడు. చోప్రా మరణ వార్త వినగానే కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. చోప్రా భౌతికకాయాన్ని భారతదేశంలోని అతని కుటుంబ సభ్యులకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మల్హోత్రా తెలిపారు. కాన్‌బెర్రాలోని భారతీయ సమాజానికి ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని స్నేహితుడు, సంఘం ప్రతినిధి గుర్‌ప్రీత్ సింగ్ గిల్ అన్నారు. మేము అతని కుటుంబ సభ్యులతో, భారత హైకమిషన్‌తో కూడా టచ్‌లో ఉన్నాము. వారు అతని భౌతిక అవశేషాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి సహాయం చేస్తున్నారు. షెపర్టన్ ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే చోప్రా ప్రమాదం జరిగింది. అందులో భారతీయ సంతతికి చెందిన నలుగురు చనిపోయారు.