Site icon HashtagU Telugu

Indian Origin Woman Dead: న్యూయార్క్ లో విమాన ప్రమాదం.. భారత సంతతికి చెందిన మహిళ మృతి

Indian Origin Woman Dead

Resizeimagesize (1280 X 720) (2)

అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళ మృతి (Indian Origin Woman Dead) చెందగా, ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడింది. మీడియా కథనాల ప్రకారం.. ఇది టెస్ట్ ఫ్లైట్. మహిళ, ఆమె కుమార్తె, పైలట్ మాత్రమే విమానంలో ఉన్నారు. మృతి చెందిన మహిళను 63 ఏళ్ల రోమా గుప్తాగా గుర్తించారు. అదే సమయంలో ఆమె కుమార్తె 33 ఏళ్ల రివా గుప్తా ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది.

విమానం లాంగ్ ఐలాండ్ హోమ్స్ మీదుగా ఎగురుతున్న సమయంలో పైలట్ విమానం నుండి పొగలు రావడాన్ని గమనించాడు. దీని తర్వాత అతను వెంటనే సమీపంలోని రిపబ్లిక్ ఎయిర్‌పోర్ట్‌కు ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే, విమానం విమానాశ్రయానికి చేరుకునే సమయానికి విమానంలో మంటలు చెలరేగడంతో రోమా గుప్తా మృతి చెందగా, కూతురు, పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదంలో గాయపడిన రివా మంటల్లో కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం సంభవించిన విమానం పైపర్ చెరోకీ ఎయిర్‌క్రాఫ్ట్ నాలుగు సీట్ల సింగిల్ ఇంజన్ విమానం. న్యూయార్క్‌లోని రిపబ్లిక్ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానం బయలుదేరింది. ఈ విమానం డానీ వైస్‌మన్ ఫ్లైట్ స్కూల్‌కు చెందినది. ప్రమాదానికి గురైన విమానం ఇటీవలే అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిందని ఫ్లైట్ స్కూల్ లాయర్ తెలిపారు. ప్రజలు ఎగరడం నేర్చుకోవాలనుకుంటున్నారా లేదా అని చూడటానికి ఇది టెస్ట్ ఫ్లైట్ అని లాయర్ అన్నారు. ఈ టెస్ట్ ఫ్లైట్ సమయంలో ప్రమాదం జరిగింది. US నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాయి. అదే సమయంలో బాధిత కుటుంబానికి ఫండింగ్ ద్వారా 60 వేల డాలర్ల నిధిని సేకరించారు.

Also Read: Elon Musk: బాత్ రూమ్ కు కూడా బాడీ గార్డ్స్ తో వెళ్తున్న మస్క్.. ఎందుకంటే..?

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మృతి

అమెరికాలోని న్యూజెర్సీలో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. ప్రిన్స్‌టన్ జంక్షన్‌కు తూర్పున ఉన్న ట్రాక్‌లపై పాదచారి నడుస్తున్నాడు. ఇంతలో బోస్టన్ నుంచి వాషింగ్టన్ వెళ్తున్న రైలు ఢీకొంది. మృతుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన అన్నమయ్య జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ దిగాల (39)గా గుర్తించారు.