Sushil Wadhwani: UK ఆర్థిక సలహా మండలిలో భారతీయుడు

బ్రిటన్ ఆర్ధిక సలహా మండలి కొత్త కమిటీలో భారత సంతతికి చెందిన పెట్టుబడుల నిపుణుడికి చోటు దక్కింది. నలుగురు సభ్యులున్న ఈ కమిటీలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కమిటీ మాజీ సభ్యుడైన సుశీల్ వాద్వానీని నియమిస్తూ యూకే ఛాన్సలర్ జెరిమి హంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

  • Written By:
  • Publish Date - October 18, 2022 / 06:34 PM IST

బ్రిటన్ ఆర్ధిక సలహా మండలి కొత్త కమిటీలో భారత సంతతికి చెందిన పెట్టుబడుల నిపుణుడికి చోటు దక్కింది. నలుగురు సభ్యులున్న ఈ కమిటీలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కమిటీ మాజీ సభ్యుడైన సుశీల్ వాద్వానీని నియమిస్తూ యూకే ఛాన్సలర్ జెరిమి హంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాద్వానీకి ఇన్వెస్ట్‌మెంట్ సెక్టార్‌లో 30 ఏళ్ల అనుభవం ఉంది.

సుశీల్ వాద్వానీ భారత సంతతికి చెందిన పెట్టుబడి నిపుణుడు. UK ఛాన్సలర్ జెరెమీ హంట్ ద్వారా కొత్త ఆర్థిక సలహా మండలికి నియమింపబడిన నలుగురు ఆర్థిక నిపుణులలో ఒకడిగా నియమితులయ్యాడు. PGIM వాద్వానీ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థకు చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా నాయకత్వం వహించారు. వాద్వానీ 30 సంవత్సరాలకు పైగా పెట్టుబడి సెక్టార్ లో అనుభవం ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్వతంత్ర ద్రవ్య విధాన కమిటీ (MPC)లో మాజీ సభ్యుడు వాద్వానీ.

ఇటువంటి గౌరవనీయమైన ఆర్థిక నిపుణుల సమూహంతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను అని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక సవాళ్ళు, అస్థిరత ఉన్న కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా అక్రమ దండయాత్ర వలన UK ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం అని వాద్వానీ పేర్కొన్నారు.