Laid-Off Just 2 Days Later: కెనడాలో జాబ్.. చేరిన రెండు రోజులకే భారీ షాక్..!

మెటా పెద్ద‌సంఖ్య‌లో తొలగింపులు (లేఆఫ్స్) చేప‌ట్ట‌డంతో ప‌లువురు భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారు.

  • Written By:
  • Updated On - November 11, 2022 / 09:35 AM IST

మెటా పెద్ద‌సంఖ్య‌లో తొలగింపులు (లేఆఫ్స్) చేప‌ట్ట‌డంతో ప‌లువురు భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారు. మెటా మాస్ లేఆఫ్స్ బారిన‌ప‌డ్డ వారిలో ఓ భారతీయ ఉద్యోగి చేరిన రెండు రోజులకే మెటాలో జాబ్ కోల్పోయాడు. మెటాలో చేరేందుకు భార‌త్ నుంచి కెన‌డా వెళ్లిన హిమాన్షుని తాజా లేఆఫ్స్‌లో తొలగించారు. అయితే ఈ విషయాన్ని హిమాన్షు లింక్డ్ ఇన్ లో షేర్ చేశాడు. మెటాలో జాబ్ లో చేరేందుకు కెన‌డా వెళ్లాన‌ని, ఉద్యోగంలో చేరిన రెండు రోజుల‌కే జాబ్ పోయిందని పేర్కొన్నాడు. మెటా చేప‌ట్టిన లేఆఫ్స్‌లో త‌న జాబ్ పోయింద‌ని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

భార‌త్‌, కెనడాల్లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ రోల్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నానని పేర్కొన్నాడు. కెన‌డా, భార‌త్‌ల్లో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్ హైరింగ్ లేదా ఎలాంటి పొజిష‌న్ మీకు తెలిసినా త‌న‌కు తెలియ‌చేయాల‌ని కోరాడు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన హిమాన్షు గతంలో అడోబ్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రముఖ సంస్థల్లో పనిచేశాడు. ఆదాయాలు తగ్గడంతో పాటు ఆర్థికమాంద్యం భయాల కారణంగా మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. 13 శాతం మందిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులకు 16 వారాల బేస్ సాలరీతో పాటు ప్రతీ ఏడాది సర్వీసుకు మరో రెండు వారాలు అదనంగా ఉద్యోగులకు చెల్లిస్తామని మెటా సంస్థ వెల్లడిాంచింది.