Site icon HashtagU Telugu

Website Hacked: ఇండియ‌న్ ఆర్మీ న‌ర్సింగ్ కాలేజీ వెబ్‌సైట్ హ్యాక్‌.. పాకిస్థాన్ ప‌నేనా.. అందులో ఏమ‌ని రాసి ఉందంటే?

Indian Army Nursing College Website Hacked

Indian Army Nursing College Website Hacked

Website Hacked: ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడిలో 26మంది ప‌ర్య‌ట‌కులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. వారిని చంపే స‌మ‌యంలో ఉగ్ర‌వాదులు నువ్వు హిందువువా..? ముస్లీంవా అంటూ అడిగి మ‌రీ చంపారు. ఈ ఘ‌ట‌న‌ను భార‌త ప్ర‌భుత్వం సీరియ‌స్ గా తీసుకుంది. పాకిస్థాన్ పై అన్నివైపుల నుంచి ముప్పేట‌దాడి చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంది. ఇప్ప‌టికే సింధు న‌దీ జ‌లాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భార‌త్ తీసుకున్న నిర్ణ‌యంతో పాకిస్థాన్ కు ఇబ్బందిక‌ర అంశ‌మే. అదేవిధంగా భార‌త్ లోని పాకిస్థానీయులు ఈనెల చివ‌రినాటికి వెళ్లిపోవాల‌ని కేంద్రం ఆల్టిమేటం జారీ చేసింది. భార‌త్ చ‌ర్య‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీనికితోడు తాజాగా ఆ దేశం హ్యాకర్లు భారత వెబ్‌సైట్‌లు లక్ష్యంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.

Also Read: Pakistan Closed Airspace: పాక్ గ‌గ‌న‌త‌లం మూసివేత‌.. భారత విమానాలు ఇప్పుడు ఏ మార్గాల్లో ప్రయాణిస్తాయి?

తాజాగా.. ఆర్మీ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ వెబ్‌సైట్‌ హ్యాక్‌కు గురైంది. పాకిస్థాన్‌కు చెందిన హ్యాకింగ్‌ బృందం ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు దేశాల సిద్ధాంతంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన హ్యాకర్లు.. హోం పేజీలో ఓ ఇమేజ్‌ను పోస్టు చేశారు. హిందువుల‌ను చంపండి.. ముస్లింల‌ను గౌర‌వించండి.. అనే సందేశం ఉర్దూ, ఇంగ్లీష్ రెండు భాష‌ల్లో వ్రాయ‌బ‌డి ఉంది. అంతేకాక‌..

Also Read: Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడా? ప్ర‌స్తుతం ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా?

“మా మతం, ఆచారాలు మైళ్ల దూరంలో ఉన్నాయి. అది మ‌మ్మ‌ల్ని బ‌లోపేతం చేస్తుంది. రెండు దేశాల సిద్ధాంతం కేవ‌లం ఒక ఆలోచ‌న కాదు, అది నిజం.. మేము ముస్లీంలం, మీరు హిందువులు. అల్లాహ్ మాతో ఉన్నాడు.. మీ మ‌తం మిమ్మ‌ల్ని ర‌క్షించ‌దు. కానీ, అది మీ మ‌ర‌ణానికి కార‌ణం అవుతుంది. మేము చాలా ఉన్న‌తంగా, శ‌క్తివంతంగా ఉన్నాము” అని సందేశం ఉంది. దీనిని ఆర్మీ వ‌ర్గాలు అధికారికంగా ధ్రువీక‌రించాల్సి ఉంది. ఇంది పాకిస్థాన్ హ్యాక‌ర్ల ప‌నేన‌ని భావిస్తున్న ఆర్మీ.. హాక‌ర్ల‌ను గుర్తించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం.