Indian Americans : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి నేతలు సత్తాచాటారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం విజయఢంకా మోగించారు. దీంతో ఆయన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు టెక్ పాలసీ అడ్వైజర్‌గా పనిచేసిన అనుభవం సుబ్రహ్మణ్యం సొంతం. ఈయన 2020లో తన పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం వర్జీనియా రాష్ట్ర సెనెట్‌కు(Indian Americans) ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో గెలవడం ద్వారా అమెరికా కాంగ్రెస్‌లోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు.
Also Read :Transgender : అమెరికా కాంగ్రెస్‌కు తొలి ట్రాన్స్‌జెండర్.. సారా మెక్‌బ్రైడ్ నేపథ్యం ఇదీ
ఇక భారత సంతతికి చెందిన మరో నేత రాజా కృష్ణమూర్తి కూడా ఎన్నికల్లో విజయభేరి మోగించారు. ఆయన ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మార్క్ రిక్‌ను 30 వేలకు పైగా ఓట్ల తేడాతో రాజా కృష్ణమూర్తి ఓడించారు. 2016 నుంచి ఈ స్థానం నుంచి వరుసగా రాజా కృష్ణమూర్తి గెలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆయన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.
Also Read :Prashanth Reddy : కన్సాస్‌లో పోరాడి ఓడిన తెలుగుతేజం ప్రశాంత్ రెడ్డి
రాజా కృష్ణమూర్తి అమెరికాలో ప్రముఖ న్యాయవాది. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో లా చేశారు. గతంలో ఇల్లినాయిస్ రాష్ట్ర డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్‌గా రాజా కృష్ణమూర్తి సేవలు అందించారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైంలో పాలసీ మేకింగ్ విభాగంలో డైరెక్టర్‌గా పనిచేశారు. రాజా కృష్ణమూర్తి మన భారత్‌లోనే జన్మించారు. అయితే ఉపాధి నిమిత్తం భారత్ నుంచి న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న బఫాలో ప్రాంతానికి చేరుకున్నారు. ఎన్నో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదిగారు.