US Elections 2024: కమలా హారిస్ ప్రచారం కోసం భారతీయ-అమెరికన్లు వినూత్న ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. అంతేకాదు ఎన్నికల కోసం పార్టీ ఫండ్ ని సేకరిస్తున్నారు. అటు ట్రంప్ ప్రజాధారణ నానాటికి పడిపోతుంది. వచ్చే అమెరికా ఎన్నికల ఫలితాల్లో కమలా హరీష్ విజయం ఖాయమని కొన్ని న్యూస్ ఛానెల్స్ ముందుగానే ప్రకటిస్తున్నాయి. అమెరికాకు భారత సంతతి వ్యక్తి అధ్యక్షురాలు కాబోతుందని అక్కడ భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమ కమ్యూనిటీలో ఒకరు డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మారడంతో ఉత్సాహంగా ఉన్న భారతీయ-అమెరికన్ల బృందం ‘కమలా కే సాథ్’ అనే ట్యాగ్‌లైన్‌తో కొత్త వెబ్‌సైట్ – DesiPresident.comను ప్రారంభించింది. హారిస్ తల్లి చెన్నై నుండి యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చింది. ఆమె తండ్రి జమైకా నుండి దేశానికి వలస వెళ్లారు.
మేము చరిత్ర సృష్టించడానికి కలిసి ర్యాలీ చేస్తాము. మీతో కలిసి ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మేము ముందుకొచ్చాము అని వెబ్‌సైట్ పేర్కొంది. ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ ప్రాజెక్ట్ అయిన దేశీ ప్రెసిడెంట్, “కమలా కే సాత్: వోట్ కమలా” అనే ట్యాగ్‌లైన్‌తో టీ-షర్ట్‌ను విడుదల చేసింది, ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతుంది.
ఇతర కార్యకలాపాలతో పాటు, ఫోన్ ద్వారా ప్రచారం చేయడానికి వీక్లీ వర్చువల్ ఫోన్ బ్యాంక్ “కమలా కే సాథ్”ను నిర్వహిస్తోంది. ఈ వారం జరిగిన కార్యక్రమంలో ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ ద్వారా ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్‌మెన్ రాజా కృష్ణమూర్తికి టీ-షర్టును బహుకరించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హిందీ నినాదాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. 2016 ఎన్నికల్లో ట్రంప్ ప్రచారంలో “అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్” అనే నినాదాన్ని ఉపయోగించారు.
Also Read: Gaddar Awards Committee: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా నర్సింగరావు , వైస్ చైర్మన్‌గా దిల్ రాజు