Site icon HashtagU Telugu

Jack Dorsey: భారత ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన ఆరోపణలు

Jack Dorsey

New Web Story Copy (58)

Jack Dorsey: భారత ప్రభుత్వంపై ట్విట్టర్(Twitter) మాజీ సీఈఓ సంచలన ఆరోపణలకు పాల్పడ్డాడు. భారత ప్రభుత్వం తనని బెదిరింపులకు గురి చేసిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన రైతు చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు రైతన్నలు. దీంతో రైతులు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. దీంతో వారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం ట్విట్టర్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినట్టు ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే ఆరోపించారు. తాజగా జాక్ డోర్సే ఆరోపణలపై భారత సర్కార్ స్పందించింది.

ట్విట్టర్ -బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను మూసివేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తామని భారత ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని, కొన్ని పోస్టులు డిలేట్ చెయ్యాలని ఒత్తిడి తెచ్చిందని మాజీ ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే (Jack Dorsey) ఆరోపణలు చేశారు. 2021లో రైతుల నిరసనల సమయంలో రైతు ఖాతాలను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ డిమాండ్‌లకు ట్విటర్ కట్టుబడి ఉండటానికి నిరాకరించడంతో బెదిరింపులు వచ్చాయని డోర్సే చెప్పారు.

డోర్సే ఆరోపణలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఈ సందర్భంగా డోర్సే ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. డోర్సే ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. డోర్సే మరియు అతని బృందం ట్విట్టర్ విషయంలో భారత చట్టాన్ని పదేపదే ఉల్లంఘించారని అన్నారు. ఇదిలా ఉండగా 2021లో ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన సందర్భంగా పలు ఖాతాలను పూర్తిగా బ్లాక్ చేయాలని కోరినట్లు ట్విట్టర్ గత ఏడాది కర్ణాటక హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను నిరోధించడం రాజ్యాంగం ప్రకారం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమేనని ట్విట్టర్ హైకోర్టులో తన పిటిషన్‌లో పేర్కొంది. ప్రభుత్వ చర్య ఏకపక్షంగా ఉందని, ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏని ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Read More: Kalaburagi: పట్టాలపై అతిపెద్ద బండరాయి.. వందల మంది ప్రాణాలు కాపాడిన లోకో పైలట్?