Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టులో జర్మనీకి భారత్ వార్నింగ్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం జర్మన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్‌ను పిలిపించి

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం జర్మన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్‌ను పిలిపించి, ఈ విషయాన్ని భారత్ అంతర్గత సమస్యగా పేర్కొంటూ నిరసన తెలియజేసింది.

శుక్రవారం జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కేజ్రీవాల్ అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అక్కడ న్యాయవ్యవస్థ ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలకు సంబంధించిన ప్రమాణాలను పాటిస్తోందని మేము ఆశిస్తున్నాము అంటూ జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కామెంట్స్ పై భారత్ ఘాటుగా స్పదించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ న్యూఢిల్లీలోని జర్మన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్‌ను పిలిపించామని పేర్కొంది.ఇది భారత్ అంతర్గత సమస్యగా పేర్కొంటూ, జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలు భారతదేశం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడం వంటిదని చెప్పింది.

Also Read: Solar Eclipse 2024: ఏప్రిల్ 8న సూర్యగ్ర‌హణం.. భార‌త్‌లో దీని ప్ర‌భావ‌మెంత‌..?