Site icon HashtagU Telugu

USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు

Stephen Miller

Stephen Miller

USA: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిబిరం నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడైన సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ ఈ వ్యాఖ్యల ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచాడు.

మిల్లర్ ప్రకారం, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్ పరోక్షంగా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని ట్రంప్ భావిస్తున్నారని వెల్లడించారు. “రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఈ యుద్ధాన్ని కొనసాగించడంలో భారత్ పాత్ర పోషించడం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ స్పష్టంగా చెప్పారు” అని ఆయన పేర్కొన్నారు.

రష్యా చమురు వాణిజ్యంలో భారత్-చైనా ముడిపడిన వాస్తవం ప్రజలకు తెలిసితే వారు ఆశ్చర్యానికి గురవుతారని మిల్లర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు, ట్రంప్ పరిపాలన రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో రావడం గమనార్హం.

Tape Warm : ప్రపంచదేశాలను వణికిస్తున్న వైరస్.. ఇలా చేయకపోతే మీ నాడీ వ్యవస్థ మొత్తం కోలాప్స్

అమెరికా పలు రకాల ఆంక్షలు, హెచ్చరికలు జారీ చేస్తున్నా భారత్ తన చమురు కొనుగోళ్లు ఆపే ఆలోచనలోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జూలై 30న ట్రంప్ భారతీయ వస్తువులపై 25% సుంకం ప్రకటించారు. అంతేకాకుండా, రష్యా నుండి చమురు కొనుగోలు ఆగకపోతే, భవిష్యత్తులో 100% వరకు అధిక సుంకాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తానని హెచ్చరించారు.

అదే సమయంలో, రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందం సాధ్యంకాకపోతే రష్యా నుండి చమురు కొనుగోలు కొనసాగించే ఏ దేశాన్నైనా అమెరికా లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ మాట్లాడుతూ భారత్, రష్యా ఆర్థిక వ్యవస్థలను “చనిపోయిన ఆర్థిక వ్యవస్థలు”గా అభివర్ణించారు.

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఈ అంశంపై స్పందిస్తూ, రష్యా చమురు కొనుగోలు భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను చికాకు పరిచే అంశంగా మారిందని తెలిపారు. అయితే, భారత్‌ను ఆయన “వ్యూహాత్మక భాగస్వామి”గా పిలిచారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2021లో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా కేవలం 3% మాత్రమే ఉండేది. ప్రస్తుతం అది 35% నుండి 40% మధ్య పెరిగింది.

AP liquor Scam : లిక్కర్ స్కాంలో సంపాదించింది డబ్బు కాదు.. ప్రజల రక్త మాంసాలు