Site icon HashtagU Telugu

Israel-Hamas War: ‘ఆపరేషన్ అజయ్’

Israel Hamas War (1)

Israel Hamas War (1)

Israel-Hamas War: ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను మరియు అక్కడ నివసిస్తున్న భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. వీలుగా భారత్ ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు. హమాస్ మిలిటెంట్లు మరియు ఇజ్రాయెల్ మధ్య ఐదవ రోజు సైనిక వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

ఇజ్రాయెల్ నుండి తిరిగి రావాలనుకునే భారత పౌరులు తిరిగి రావడానికి వీలుగా #OperationAjayని ప్రారంభించడం జరిగింది అని జైశంకర్ ఎక్స్ లో పోస్ట్ చేసారు. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక చార్టర్ విమానాలు మరియు ఇతర ఏర్పాట్లు చేశారు. విదేశాల్లో ఉన్న జాతీయుల భద్రత మరియు శ్రేయస్సుకు భారత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అని ఆయన అన్నారు.

Also Read: Daily Walking : రోజూ వాకింగ్ చేస్తున్నారా ? ఎన్ని అడుగులు నడవాలంటే..