Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్ తక్కువగా చెప్పిన కంటే చాలా ఎక్కువ టార్గెట్లు పాకిస్తాన్‌లో కొట్టినట్లు అక్కడి అధికారిక దస్తావేజు ఒకటి బయటపడింది . పాకిస్తాన్ చేపట్టిన ‘ఆపరేషన్ బునియన్ ఉన్ మార్సూస్’పై తయారు చేసిన ఈ దస్తావేజులో, భారత్ కనీసం 8 టార్గెట్లు అదనంగా ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఈ మ్యాప్స్ ప్రకారం, భారత్ .. పేషావర్, జంగ్, సింధ్‌లోని హైదరాబాదు, పంజాబ్‌లోని గుజరాత్, గుజ్రాన్వాలా, భావల్‌నగర్, అటాక్, చోర్‌లపై బాంబుల దాడులు చేసింది . ఇవి మేలో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత భారత వైమానిక దళం లేదా డీజీఎంఓ (Director General of Military Operations) ప్రెస్ బ్రీఫింగ్‌ల్లో ఈ విషయాలు పేర్కొనలేదు.
Read Also: రహస్య విమాన యాత్ర, రేడియో నిశ్శబ్దం: ఢాకా నుంచి షేఖ్ హసీన భారత్‌కు పారిపోయిన తీరుపై విపుల వివరాలు
ఈ కొత్త వివరాలు చూస్తే, భారత్ దాడుల ప్రామాణికత మరింత లోతుగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇదే కారణంగా పాకిస్తాన్ శాంతి చర్చలకు ముందుకొచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ దస్తావేజు ఇస్లామాబాద్ చేసిన భారీ నష్టం వివరాల వాదనల్ని తప్పుపట్టేలా చేస్తోంది. పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు మరణించిన తర్వాత భారత్ ప్రతీకార చర్యల్లో దిగింది. ఈ క్రమంలో, భారత సైన్యం నిర్వహించిన మీడియా బ్రీఫింగ్‌లలో కొన్ని టార్గెట్లు ఉద్దేశపూర్వకంగా వెల్లడించకపోవడం ఒక వ్యూహం భాగమని నిపుణులు భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పాకిస్తానే దాడుల అసలైన పరిమాణాన్ని బహిర్గతం చేసుకున్నట్టు అర్ధం అయ్యింది.
ఇంతకు ముందు మాక్సార్ టెక్నాలజీస్ విడుదల చేసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా భారత్ చేసిన టార్గెట్ దాడుల ప్రభావం బయటపడింది. మే 7న భారత వాయుసేన పాక్ మరియు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. బహావల్పూర్‌లో జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, మురీద్కేలో లష్కరే తోయిబా శిక్షణా కేంద్రం సహా మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో దాడులు జరిగినట్లు ఇతర టార్గెట్లు ముజఫరాబాద్, కోట్లీ, రావలకోట్, చక్స్వారీ, భింబర్, నీలం వ్యాలీ, జీలం, చక్వాల్‌లులో దాడి జరిగినట్టు తెలుస్తోంది.
Read Also: Microsoft : మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్‌లు.. 300 మంది తొలగింపు