Site icon HashtagU Telugu

India Vs Canada : కెనడా దౌత్యవేత్తను బహిష్కరించిన భారత్.. ఐదురోజుల్లోగా వెళ్లిపోవాలని ఆర్డర్

Delimitation

Pm Modi Parliament

India Vs Canada : భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారత ప్రభుత్వ సీక్రెట్ ఏజెంట్లే కెనడా పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను మర్డర్  చేశారని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంటులో చేసిన ఆరోపణలను మోడీ సర్కారు ఖండించింది. హర్దీప్ సింగ్ నిజ్జార్‌ హత్యలో భారత్ కు చెందిన ఒక అత్యున్నత దౌత్యవేత్త హస్తం ఉందని ట్రూడో చేసిన అభియోగాలను తోసిపుచ్చింది. ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం భారత సర్కారు కీలక నిర్ణయం తీసకుంది. భారత్ లో ఉన్న కెనడా సీనియర్ దౌత్యవేత్తలలో ఒకరిపై బహిష్కరణ వేటు వేసింది. ఐదు రోజుల్లోగా భారత్ ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.  ఈరోజు  భారతదేశంలోని కెనడా హైకమిషనర్‌ను పిలిపించి ఈవిషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు తెలియజేశాయి.

Also read : Delhi : కొత్త పార్లమెంట్ కు ఏ పేరు పెట్టారు..పాత పార్లమెంట్ ను ఏంచేయబోతున్నారు..?

అయితే భారత్ నుంచి బహిష్కరణ వేటుకు గురైన కెనడా దౌత్యవేత్త ఎవరు ? అనేది ఇంకా వెల్లడికాలేదు. కెనడాలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ.. కెనడా సర్కారు  సోమవారం రోజు ఒక సీనియర్ భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ప్రతిచర్యగా భారత్ కూడా కెనడాకు చెందిన ఒక దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. కెనడాలో రోజురోజుకు పెరుగుతూపోతున్న ఖలిస్తానీ కార్యకలాపాలపై కేంద్ర సర్కారు ఆందోళనగా (India Vs Canada) ఉంది.