Nikki Haley: భారత్ పై నిక్కీ హేలీ మాటల తూటాలు

వాషింగ్టన్ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ ఏదీ మాట్లాడినా సంచలనమే..గత ఏడాది అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో తాను ఉన్నానంటూ ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి దారి తీసింది ప్ర‌వాస భార‌తీయురాలైన నిక్కీ హీలీ.

Nikki Haley: వాషింగ్టన్ రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ ఏదీ మాట్లాడినా సంచలనమే..గత ఏడాది అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో తాను ఉన్నానంటూ ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి దారి తీసింది ప్ర‌వాస భార‌తీయురాలైన నిక్కీ హీలీ. తరువాత విదేశాంగ విధానం, అమెరికా అందించే ఆర్థిక సాయం, వీసాల మంజూరుపై సీరియ‌స్ గా స్పందించారు. బ‌ల‌మైన అమెరికా శ‌త్రువుల‌ను ఉపేక్షించదాదని, అమెరికా ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి సంపాదించిన సంపదను ఉదారంగా ఎవరికీ ఇవ్వరాదంటూ కామెంట్ చేశారు.

నిక్కీ హేలీ తాజాగా భారత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉండాలని ఉన్నా, అమెరికా పెద్దన్న పాత్ర పోషించడం మీద భారత్ కు విశ్వాసం లేదంటూ వ్యాఖ్యానించారు. అందుకే భారత్ రష్యాతో సన్నిహింతంగా ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత్ చాలా స్మార్ట్ గా వ్యవహరిస్తోందన్నారు హేలీ

పాక్స్ బిజినెస్ న్యూస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నెక్కీ హెలీ పలువిషయాలు పంచుకున్నారు. ఆ సందర్బంలో ఆమె మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితిలో తాను అమెరికా రాయబారిగా పనిచేశాను.. ఆ సందర్భంలో పలుమార్లు భారత్ ప్రధానితో మాట్లాడాను . రష్యాతో కాకుండా అమెరికాతో భాగస్వామిగా ఉండాలని భారత్ కోరుకున్నా, ప్రస్తుతానికి మన నాయకత్వం మీద వారికి నమ్మకం లేదని తెలియజేశారు హీలీ , అమెరికా బలహీనంగా ఉందన్నది భారత్ అభిప్రాయం అందుకే వారు రష్యాతో స్నేహంగా ఉంటున్నారు అని తెలియజేశారు హేలీ.

అమెరికా ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాలపైనే అధికంగా దృష్టి సారిస్తోందని . అలా కాకుండా భాగస్వాముల తోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే అమెరికాతో భారత్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణకొరియా, న్యూజిలాండ్ కలిసి వస్తాయని వివరించారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక పరిస్థితి బాగోలేదని హేలీ అన్నారు. కాగా ఈ నెల 24న ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో ట్రంప్, హేలీలు పోటీపడనున్నారు.

Also Read: Lord Shani: స్త్రీలు శని దేవుడికి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?