Dangerous Heat: భవిష్యత్తులో 3 రెట్లు పెరగనున్న వాతావరణంలో వేడి

రాబోయే దశాబ్దాలలో ప్రపంచంలోని చాలా భాగంలో వాతావరణంలో వచ్చే తీవ్ర మార్పుల వల్ల వేడి తీవ్రత మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

  • Written By:
  • Publish Date - August 29, 2022 / 07:00 AM IST

రాబోయే దశాబ్దాలలో ప్రపంచంలోని చాలా భాగంలో వాతావరణంలో వచ్చే తీవ్ర మార్పుల వల్ల వేడి తీవ్రత మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. భూమి మధ్య అక్షాంశంలో ఉష్ణోగ్రతలు 103 (39.4 డిగ్రీల సెల్సియస్) డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇక ముందు అప్పుడప్పుడు వాతావరణంలో ఇటువంటి మార్పులు సంభవిస్తాయి. ఈ శతాబ్ధం మధ్యనాటికి ప్రతి సంవత్సరం వేసవి కాలంలో 20 నుంచి 50 రెట్లు పెరిగే అవకాశం ఉంది. 2100 నాటికి ఆమెరికాలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలలో తీవ్రత కొనసాగుతుంది. ఉష్ణమండల ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండే అవకాశం ఉంది. 124 డిగ్రీల(51 డిగ్రీల సెల్సియస్) కంటే ఎక్కువ తీవ్రంగా ఉండే వేడి సూచీని అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. అయితే, అటువంటి ఉష్ణో గ్రతలు అరుదుగా సంభవిస్తాయి.

ఈ శతాబ్ది చివరినాటికి భారతదేశంలోని ఉష్ణమండలంలో కూడా ఇటువంటి ఉష్ణోగ్రతలు సంభవించే అవకాశం ఉంది. ఇది ఒక రకమైన భయానకమైన పరిస్థితిగా హార్వర్డ్ వాతావరణ శాస్త్రవేత్త లూకాస్ జెప్పెటెల్లో తన అధ్యయనంలో పేర్కొన్నారు.కోట్ల మంది ప్రజలు ఇటువంటి తీవ్రమైన ఉష్ణోగ్రతలను భరించవలసి ఉంటుంది.ఇంతకు ముందు ఎప్పడూ సంభవించని పరిస్థితులు సంభవిస్తాయి.