Site icon HashtagU Telugu

Population of England : ఇంగ్లండ్ లో సగం తగ్గిన క్రైస్తవ జనాభా…పెరిగిన హిందువుల సంఖ్య…!!

World Population Day

World Population Day

ఇంగ్లండ్ లో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా క్రైస్తవుల జనాభా సగానికి కంటే తక్కువగా ఉంది. మంగళవార విడుదల చేసిన తాజా జనాభా లెక్కల్లో ఈ విషయం వెల్లడైంది. క్రైస్తవుల సంఖ్య గణనీయంగా తగ్గి…హిందూ, ముస్లిం జనాభాల్లో పెరుగుదల నమోదు అయ్యింది. 2021 జనాభా లెక్కల విడుదల చేస్తూ ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఇంగ్లండ్ వెల్స్ లో మొత్తం క్రైస్తవుల జనాభా ఇప్పుడు 46.2శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2011లో ఇది 59.3శాతంగా ఉండేది. ఈ తాజా గణాంకాలను బట్టి చూస్తే క్రైస్తవుల జనాభాలో 13.1శాతం తగ్గింది.

ముస్లింల జనాభా 2011లో 4.9గా ఉంటే ఇప్పుడు 6.5శాతానికి పెరిగింది. జనాభా పరంగా గతంలో ఇంగ్లాండ్ లో 27లక్షల మంది ముస్లింలు నివసించేవారు. ఇప్పుడు వారి జనాభా 39లక్షలకు పెరిగింది. ఇక హిందువులు 1.5శాతం నుంచి 1`.7శాతానికి పెరిగింది. అంటే లెక్కల ప్రకారం బ్రిటన్ లో 8.18లక్షల మంది హిందువులు ఉంటే..ఇప్పుడు 10లక్షలకు వరకు పెరిగినట్లు జనాభా గణాంకాల్లో పేర్కొంది.

ఎలాంటి మతాన్ని నమ్మనివారి సంఖ్య మాత్రం పెరగలేదు. వారి సంఖ్య 37.2శాతంగా ఉంది. యూదుల సంఖ్య పెరగలేదు. 2011లో 25శాతంగా ఉంది. ఇప్పుడు 0.5శాతంగా నమోదు అయ్యింది. కాగా లండన్ కు ఉత్తరాన ఉన్న హోరోలో అత్యధికంగా 25.8శాతం హిందువులు ఉన్నట్లు డేటా వెల్లడించింది.