Site icon HashtagU Telugu

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ.. షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు..!

Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ముగ్గురు పీటీఐ నేతలు గురువారం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మే 9న దేశంలో జరిగిన హింసాకాండ నుంచి చాలా మంది పీటీఐ నేతలు పెద్ద సంఖ్యలో పార్టీని వీడారు. జియో న్యూస్‌ ఈ మేరకు పేర్కొన్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

మే 9న జరిగిన సంఘటన బాధాకరమని చెప్పారు

జియో న్యూస్ ప్రకారం.. మే 9 న దేశంలో జరిగిన సంఘటనను విలేకరుల సమావేశంలో మలికా బుఖారీ ఖండించారు. మే 9 నాటి ఘటనలను నేను ఖండిస్తున్నాను. ప్రతి పాకిస్థానీకి మే 9 నాటి ఘటనలు చాలా బాధాకరమని ఆమె అన్నారు. ఈ సందర్భంగా బుఖారీ మాట్లాడుతూ.. పార్టీని వీడే నిర్ణయం పూర్తిగా నాదేనన్నారు. నేను ఎలాంటి ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకోవడం లేదు అని తెలిపారు.

Also Read: Dimple Hayathi : పార్కింగ్ వివాదం అనంతరం డింపుల్ కి ప్రాణహాని.. అనుమానిత కాల్స్.. డింపుల్ ఇంటికి అనుమానిత వ్యక్తులు..

జైలు నుంచి విడుదలైన తర్వాత బుఖారీ పార్టీని వీడారు
.
లాయర్‌గా దేశంలో సానుకూల పాత్ర పోషించాలని, నా కుటుంబంతో కూడా సమయం గడపాలని కోరుకుంటున్నాను అని పాక్ మీడియాతో ఆమె పేర్కొంది. అడియాలా జైలు నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే మలికా బుఖారీ పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

మాజీ ఆర్థిక మంత్రి పీటీఐకి గుడ్ బై చెప్పారు

అదే సమయంలో పాకిస్తాన్ మాజీ ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. అడియాలా జైలు నుంచి విడుదలైన వెంటనే ఉమర్ పార్టీని వీడినట్లు ప్రకటించినట్లు పాకిస్థాన్ వార్తాపత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదించింది. ఇస్లామాబాద్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఉమర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ పరిస్థితులలో నేను పార్టీకి నాయకత్వం వహించడం సాధ్యం కాదు. నేను PTI ప్రధాన కార్యదర్శి, కోర్ కమిటీ సభ్యునికి రాజీనామా చేస్తున్నాను అని అన్నారు.