Imran Khan : బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు భారత్ తో సత్సంబంధాలు అసాధ్యం…!!

  • Written By:
  • Updated On - November 22, 2022 / 10:49 AM IST

బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ తో తమ దేశం సత్సంబంధాలు మెరుగుపరుచుకోవల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం అది సాధ్యం కాదన్నారు. బ్రిటిష్ దినపత్రిక ది టెలిగ్రాఫ్ కు ఇచ్చిన ప్రత్యేకఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు పొరుగు దేశాలు పర‌స్పరం వాణిజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎన్నో ఈ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలును డాన్ ప్రతిక కూడా ప్ర‌చురించింది.

భారత్, పాక్ సంబంధాలు మెరుపగడితే ఎన్నో ప్రయోజనాలుఉన్నాయన్న ఇమ్రాన్ ఖాన్..కశ్మీర్ దీనికి ప్రధాన అడ్డంకిగా ఉందని వాదించారు.

ఇది సాధ్యమేనని నేను భావిస్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం సమస్యలపై చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇది జాతీయవాద దృక్ప‌థాన్నికలిగి ఉంది. జాతీయవాద భావాలను రెచ్చగొట్టడం వల్ల మీకు ఎలాంటి అవకాశం ఉండదు. ఒక్కప్పుడు జాతీయవాదం సీసాలో లేదు. దాన్ని తిరిగి సీసా పెట్టడం చాలా కష్టం అని ఇ్ర‌మాన్ అన్నారు.

తాను ప్రధానిగా తిరిగి ఎన్నికైనట్లయితే..ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, చైనా, అమెరికాతోపాటు పాకిస్తాన్ కు పొరుగున ఉన్న దేశాలన్నింటితో సత్సంబంధాలు నెలకొల్పేలా ప్రయత్నిస్తానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.