Former PM Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు.. నన్ను చంపాలని చూస్తున్నారు..!

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Former PM Imran Khan) ఆరోపణలు చేశారు. తనను ప్రధాని పదవి నుంచి తప్పించిన వెంటనే తనను చంపేందుకు పథకం పన్నారని టీవీలో ప్రసంగిస్తూ చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Imran Khan

Imran Khan

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీపై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Former PM Imran Khan) ఆరోపణలు చేశారు. తనను ప్రధాని పదవి నుంచి తప్పించిన వెంటనే తనను చంపేందుకు పథకం పన్నారని టీవీలో ప్రసంగిస్తూ చెప్పారు. అంతకుముందు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకు నలుగురు వ్యక్తులు పథకం పన్నారని చెప్పారు. ప్రణాళిక గురించి నేను వెల్లడించినప్పుడు, వారు వెనక్కి తగ్గారు అని ఇమ్రాన్ అన్నారు.

Also Read: Jerusalem Attack: ఇజ్రాయిల్ లో విషాదం.. కాల్పుల్లో 7 మంది మృతి

మతం పేరుతో మళ్లీ నన్ను అంతమొందించేందుకు ప్లాన్‌ బి రూపొందించారని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. వజీరాబాద్‌లో జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఇమ్రాన్‌ ఈ విషయాలు చెప్పాడు. వజీరాబాద్‌లో తనపై ప్లాన్-బి అమలు చేసి అంతమొందించాలని చూశారని, అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డానని గుర్తు చేశారు. ప్లాన్-బి విఫలం కావడంతో ఇప్పుడు ప్లాన్-సి అమలు చేస్తున్నారని అన్నారు.

ఇప్పుడు ఆసిఫ్ అలీ జర్దారీ తనను చంపేందుకు ప్లాన్ సి సిద్ధం చేసినట్లు మాజీ ప్రధాని చెప్పారు. అసిఫ్ అలీ జర్దారీ వద్ద చాలా డబ్బు ఉందని, సింధ్ ప్రభుత్వం నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్మును జర్దారీ తన హత్యకు ఉపయోగిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆసిఫ్ అలీ జర్దారీ తదుపరి నేరం చేయాలని ప్లాన్ చేసుకున్నాడని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ మేరకు మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏది ప్లాన్ చేసినా.. వజీరాబాద్ దాడిలో తగిలిన గాయాల నుంచి కోలుకున్న వెంటనే మళ్లీ వీధుల్లోకి వస్తానని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ చెప్పారు. తనకు ఏమైనా జరిగితే దేశానికి తెలియాలని అన్నారు. కాగా.. గతేడాది నవంబరు 3న ఇమ్రాన్‌పై జరిగిన దాడిలో ఆయన కుడికాలికి బుల్లెట్ గాయమైంది.

  Last Updated: 28 Jan 2023, 11:58 AM IST