Rs 5800 Crore Loan : సంక్షోభంలో పాక్‌.. రూ.5,800 కోట్ల ఐఎంఎఫ్ లోన్

Rs 5800 Crore Loan : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) రూ.5,800 కోట్ల లోన్‌ను మంజూరు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Government In Pakistan

Rs 5800 Crore Loan : ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) రూ.5,800 కోట్ల లోన్‌ను మంజూరు చేసింది. ఈవిషయాన్ని పాకిస్తాన్ ఆర్థిక శాఖ వెల్లడించింది. దీంతో పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ మంజూరు చేసిన లోన్ రూ.15వేల కోట్లకు పెరిగింది. పాక్ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి లోన్ అవసరమని పేర్కొంటూ పాక్ తాత్కాలిక ఆర్థిక మంత్రి షంషాద్ అక్తర్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన రిక్వెస్ట్‌ను IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు(Rs 5800 Crore Loan)  ఆమోదించింది. దీంతో పాక్‌కు మరోసారి లోన్ మంజూరైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ను ఆదుకునేందుకు యూఏఈ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్‌లో యూఏఈ 20-25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కకర్ సమావేశమైన తర్వాత ఈ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంధనం, పోర్ట్ కార్యకలాపాలు, మురుగునీటి శుద్ధి, ఆహార భద్రత, లాజిస్టిక్స్, మైనింగ్, విమానయానం మరియు బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఇరు దేశాలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. అయితే ఈ ఎంఓయూల ఖచ్చితమైన సమచారం తెలియనప్పటికీ.. యూఏఈ, పాకిస్తాన్‌లో 20-25 బిలియన్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also Read: US – UK Vs Houthis : మరో యుద్ధం.. యెమన్ హౌతీలపై అమెరికా, బ్రిటన్ ఎటాక్స్ షురూ

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత కొంత కాలంగా కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ద్రవ్యోల్భణం గరిష్ట స్థాయికి చేరుకుంది. పలు దేశాలను అప్పుల కోసం అభ్యర్థిస్తోంది. విదేశీమారక నిల్వలు లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతులు తగ్గాయి. చివరకు పాకిస్తాన్ తన పాస్ పోర్టులను ముద్రించుకోవడానికి కూడా కాగితాన్ని దిగుమతి చేసుకోలేకపోతోంది. దీంతో పాటు అక్కడి గ్యాస్, విద్యుత్, ఇంధనం ధరలు పెరిగాయి. ప్రజలు వీటిని తగ్గించాలని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపడుతున్నారు.ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక, పౌష్టికాహరం కోసం ఒక్క గుడ్డును కొనాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా ఒక్క గుడ్డు ధర రూ.32​కు చేరుకుంది. దీంతో, గుడ్డు కొనాలంటే పాకిస్తానీలు భయపడిపోతున్నారు. పాకిస్తాన్‌లో ధరల పెరుగుదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్‌లో గుడ్దు ధరలు పెరిగాయి. అధికారికంగా డజన్‌ గుడ్ల ధర ఏకంగా రూ.360కి చేరుకుంది. ఈ మేరకు పాకిస్తాన్‌ మీడియా కూడా గుడ్ల ధరలు పెరిగినట్టు నివేదికల్లో పేర్కొన్నాయి. ఇక, 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజను గుడ్లను రూ.360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ, రిటైల్‌ వ్యాపారులు రూ.389కి అమ్ముతున్నారు. ఒక్కో గడ్డు ధర రూ.32కి చేరుకుంది.

  Last Updated: 12 Jan 2024, 08:54 AM IST