అమెరికా, నాటో ఎన్ని హెచ్చరికలు చేసిన పుతిన్ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించాడు పుతిన్. అప్పటి నుంచి ఆ దేశ భూభాగాలను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఉక్రెయిన్ లోని నాలుగు భూభాగాలను రష్యాలో విలీనం చేసుకున్నారు పుతిన్.
ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న దొనెత్క్స్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలు రష్యాలో విలీనం అయ్యాయి. క్రెమ్లిన్ లో జరిగిన కార్యక్రమంలో పుతిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఉక్రెయిన్ కు చెందిన 15శాతం భూభాగం రష్యాలో విలీనమైనట్లు చెప్పారు. విలీన ఒప్పందంపై ఆ నాలుగు ప్రాంతాలకు చెందిన అధినేతలు సంతకాలు చేశారు. అయితే పుతిన్ చేసిన ప్రకటనను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ కొట్టిపారేశారు. పనికిరాని ప్రకటన అంటూ…వాస్తవాలను ఎవరు మార్చలేరని తెలిపారు. రష్యా విలీనం చేసుకున్న ఆ ప్రాంతాల్లో నాటో దళాలు అడుగు పెట్టవు. ఒకవేళా అందుకు విరుద్ధంగా జరిగే…పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారే ఛాన్స్ ఉంటుంది.