Tuesday Sins: మామూలుగా ప్రతివారం ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఆ వారంలో కొన్ని దేవుళ్లకు ప్రీతికరమైన రోజులు కూడా ఉంటాయి. అలాగే మంగళవారం కూడా ఆంజనేయులుకి ఎంతో ప్రీతికరమైన రోజు. ఇక ఆరోజు ఆయనను ఉంచడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఆయనకు చేసే పూజలు చాలా బలంగా ఉంటాయి. కొన్ని శాస్త్రాల ప్రకారం మంగళవారం రోజు ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చని తెలుస్తుంది.
అయితే మంగళవారం రోజు చేయకూడని కొన్ని పనులు ఏవైనా చేస్తే అంగారకుడి చెడు దృష్టి ఏర్పడుతుందని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదని.. చికాకులు, గొడవలు జరుగుతాయని తెలుస్తుంది. మరి ఇంతకు ఆ పనులు ఏంటంటే.. మంగళవారం రోజు కొత్త బట్టలు అసలు కొనకూడదు. ఒకవేళ అప్పటికే కొనేసి ఉన్నా కూడా ధరించకూడదు.
ఆరోజు కొత్త బట్టలు కొని ధరించడం వల్ల ఎక్కువ రోజులు ఉండవని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక మంగళవారం రోజు మసాజ్, మాలిష్ వంటివి కూడా చేయకూడదు. దీనివల్ల ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా కొన్ని వ్యాధులు కూడా చేరుతాయి. ఇక జుట్టు కత్తిరించడం, షేవింగ్ చేయటం వల్ల కూడా దరిద్రం వెంటాడుతుంది.
దానివల్ల శారీరక సమస్యలు ఎదురవుతాయి. కొత్త బూట్లను, కొత్త చెప్పులను కూడా ధరించకూడదు. దానివల్ల డబ్బులు కూడా కోల్పోయా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతేకాకుండా మంటలు, దొంగతనం జరిగే ప్రమాదాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. కాబట్టి ప్రతి మంగళవారం ఇటువంటి పనులు పొరపాటున కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఈ సమస్యలు తప్పవని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.