China : రష్యాతో వాణిజ్యం చేయొద్దంటూ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్న అమెరికాపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇతరులు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పా?’ అంటూ అమెరికాను గట్టిగా ప్రశ్నించింది. అంతర్జాతీయ వేదిక అయిన ఐక్యరాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి గెంగ్ షువాంగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా ఇప్పటికే ఎన్నో ఆర్థిక, రణనీతిగత చర్యలు తీసుకుంటోంది. వాటిలో భాగంగానే రష్యా నుంచి చమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన చైనా, ఈ నిర్ణయాన్ని రెండు ముఖాల రాజకీయంగా అభివర్ణించింది.
Read Also: AP Police : ఏపీలో పోలీసు కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదల
గెంగ్ షువాంగ్ ఆరోపించారంటే ఇతర దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తే అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కానీ అదే అమెరికా, అత్యధికంగా రష్యాతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తోంది. ఇది ద్వంద్వ ప్రమాణాలకు ప్రతిరూపం. ఇతరులపై బలహీనమైన నిందలు మోపడం తగదు. అసలు అమెరికా తన ఆచరణను మొదట పరిశీలించాలి అని తీవ్రంగా స్పందించారు. చైనా తరఫున ఆయన స్పష్టంగా తెలిపారు. తమ దేశం రష్యా లేదా ఉక్రెయిన్‌కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని, మిగతా దేశాలతో మామూలు వాణిజ్య సంబంధాలే కొనసాగిస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ చట్టాల పరిధిలోనే తమ చర్యలు ఉన్నాయని స్పష్టం చేశారు. అమెరికా చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, ప్రగాఢ రాజకీయ ఉద్దేశంతో కూడుకున్నవని తేల్చిచెప్పారు.
అంతేకాక, భద్రతా మండలిలో అమెరికా ప్రతినిధి చేసిన విమర్శలను గెంగ్ షువాంగ్ తిరస్కరించారు వాస్తవాలను తప్పుగా చిత్రీకరించడం, ఇతరులను బాధ్యతవహించాల్సిన స్థితికి నెట్టడం సరైంది కాదు. ఇప్పుడైనా అమెరికా తగిన ఆత్మపరిశీలన చేయాలి అంటూ అమెరికా వైఖరిని తేలికగా తీసుకోకూడదని సూచించారు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారం కోసం ప్రపంచ దేశాలన్నీ చురుగ్గా ముందుకు రావాల్సిన అవసరముందని, కాల్పుల విరమణకు దోహదపడే విధంగా అమెరికా చొరవ తీసుకోవాలని చైనా సూచించింది. శాంతి స్థాపన కోసం రాజకీయ మార్గాలే ప్రయోజనకరమని, ఆ దిశగా చర్యలు అవసరమని పేర్కొంది. ఈ తగాదాలో అమెరికా తాను పాటించే ప్రమాణాలను ఇతరులపై వేయడం, కానీ తానే తప్పులు చేయడం అనే ఆరోపణతో చైనా అమెరికా పై దాడికి దిగింది. ఇదే సమయంలో అమెరికా దుర్నీతిని, ద్వంద్వ ధోరణిని బహిర్గతం చేస్తూ ప్రపంచ సమాజాన్ని పునరాలోచనకు నడిపిస్తోంది.
Read Also: BC Janardhan Reddy : విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేయడం బాధాకరం.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు