Yahya Sinwar Video : గాజా టన్నెల్‌లో హమాస్ అగ్రనేత.. యహ్యా సిన్వార్ వీడియో ఫుటేజీ

Yahya Sinwar Video : ప్రపంచంలోనే పవర్ ఫుల్ దేశంగా ఇజ్రాయెల్‌కు పేరుంది. దాని మిలిటరీ టెక్నాలజీ గురించి చాలా గొప్పలు చెబుతుంటారు.

Published By: HashtagU Telugu Desk
Yahya Sinwar Video

Yahya Sinwar Video : ప్రపంచంలోనే పవర్ ఫుల్ దేశంగా ఇజ్రాయెల్‌కు పేరుంది. దాని మిలిటరీ టెక్నాలజీ గురించి చాలా గొప్పలు చెబుతుంటారు. అయినప్పటికీ అక్టోబర్‌ 7 నుంచి ఇప్పటివరకు మన హైదరాబాద్ నగరమంత సైజు కూడా లేని గాజా నగరంతో పోరాడుతూనే ఉంది. సొంత సైన్యం కూడా లేని గాజా నగరంలోని మిలిటెంట్లతో ఇజ్రాయెల్ గత నాలుగు నెలలుగా ఫైట్ చేస్తోంది. ఇప్పటికే వందలాది మంది ఇజ్రాయెలీ సైనికులు ఈ పోరులో చనిపోయారు. మిలిటెంట్ సంస్థ ‘హమాస్’  గాజా నగరం కేంద్రంగా ఇంత టఫ్ ఫైట్ ఇస్తుండటం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు ? అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన సడెన్ ఎటాక్ వెనుక ఒక సూత్రధారి ఉన్నాడు ? అతడు ఎవరో తెలుసా ? హమాస్‌ అగ్రనేత యహ్యా సిన్వర్‌ !! అతడు ఇంకా గాజాలోని టన్నెల్స్‌లోనే ఉన్నాడు. టన్నెల్స్‌లో ఉంటూ ఇజ్రాయెల్ దళాలలపై దాడి కోసం హమాస్ మిలిటెంట్లకు గైడెన్స్ చేస్తున్నాడు. తాజాగా యహ్యా సిన్వర్‌ గాజా టన్నెల్ లోపలి నుంచి వెళ్తున్న ఒక వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. అతడిని ప్రాణాలతో కానీ.. శవంగా కానీ త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించింది.కింద ఉన్న ఆ వీడియోను(Yahya Sinwar Video) మీరు కూడా చూడండి..

We’re now on WhatsApp. Click to Join

దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌ ప్రాంతంలో ఉన్న ఒక టన్నెల్‌లో హమాస్‌ అగ్రనేత యహ్యా సిన్వర్‌ కుటుంబంతో సహా తిరుగుతున్నట్లుగా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో పోస్ట్ చేసింది.  ఇందులో అతడి భార్య, పిల్లలు, సోదరుడు ఇబ్రహీం సిన్వర్‌ కలిసి ఓ సొరంగంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సీన్ ఉంది.  యహ్యా సిన్వ్  చేతిలో ఓ బ్యాగ్‌ కూడా ఉంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అతడే ప్రధాన లక్ష్యం. ఈ వీడియోపై ఇజ్రాయెల్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాస్‌ సొరంగాల్లోని సీసీటీవీ నుంచి ఈ దృశ్యాలను సేకరించామని వెల్లడించింది. ఈ ఫుటేజీ అక్టోబర్‌ 10 నాటిదని పేర్కొంది. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం కుటుంబంతో కలిసి అతడు భూగర్భ సొరంగాల్లో ముందస్తుగానే సిద్ధం చేసుకొన్న సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోయాడని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలోని  ఓ సమాధి కింద ఉన్న ఈ సొరంగంపై తమ బలగాలు ఇప్పటికే దాడి చేశాయని చెప్పింది. దానిలో బెడ్‌రూమ్‌లు, ఖాన్‌ యూనిస్‌ బ్రిగేడ్‌ తూర్పు బెటాలియన్‌ల ప్రధాన కార్యాలయం ఉన్నాయని వివరించింది. సిన్వర్‌ను పట్టుకొనే వరకు తమ వేట ఆగదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.

Also Read :PM Vishwakarma Scheme : చేతివృత్తుల వారికి 3 లక్షల లోన్.. ‘పీఎం విశ్వకర్మ’కు అప్లై చేయండిలా

గతేడాది డిసెంబర్‌లో ఒకసారి యహ్యా సిన్వర్‌ ఇంటిని ఐడీఎఫ్‌ బలగాలు చుట్టుముట్టాయి. కానీ ఆరోజు అతడు తప్పించుకున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ వద్ద సిన్వర్‌కు సంబంధించిన తాజా సీసీటీవీ దృశ్యాలు కూడా ఉన్నాయట. అతడి సమీప బంధువులు, కీలక వ్యక్తులను ఈ నెలలోనే ఐడీఎఫ్‌ బలగాలు అరెస్టు చేశాయి. వీరిలో హమాస్‌ రఫా బ్రిగేడ్‌ అధిపతి కూడా ఉన్నాడట. మరో హమాస్‌ అగ్రనేత  ఇస్మాయిల్‌ హనియా కుమారుడు హజెం హనియే ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో మృతి చెందాడు.

Also Read : Indian Family Killed : అమెరికాలో భారతీయ ఫ్యామిలీ హత్య ? దంపతులు, ఇద్దరు కవల పిల్లల మృతి

  Last Updated: 14 Feb 2024, 03:43 PM IST