అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

Donald Trump  అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలే కాదు మాటలు కూడా అప్పుడప్పుడూ వింతగా ఉంటాయి. తాజాగా తన కేబినెట్ ఎంపికపై ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్య రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించడం వెనుక ఆయన భార్య అందమే ప్రధాన కారణమంటూ ట్రంప్ బాహాటంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. “ఆమెను చూడగానే నాకో అభిప్రాయం ఏర్పడింది.. అందుకే ఈ పదవి ఇచ్చాను” అంటూ ఓవల్ ఆఫీసులో […]

Published By: HashtagU Telugu Desk
Trump Suggests He Hired Doug Burgum Because Wife Is Attractive

Trump Suggests He Hired Doug Burgum Because Wife Is Attractive

Donald Trump  అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలే కాదు మాటలు కూడా అప్పుడప్పుడూ వింతగా ఉంటాయి. తాజాగా తన కేబినెట్ ఎంపికపై ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్య రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా ఇంటీరియర్ సెక్రటరీగా డగ్ బర్గమ్‌ను నియమించడం వెనుక ఆయన భార్య అందమే ప్రధాన కారణమంటూ ట్రంప్ బాహాటంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. “ఆమెను చూడగానే నాకో అభిప్రాయం ఏర్పడింది.. అందుకే ఈ పదవి ఇచ్చాను” అంటూ ఓవల్ ఆఫీసులో డగ్ బర్గమ్‌, ఆయన భార్య ఎదురుగానే వ్యాఖ్యానించారు.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తన కేబినెట్‌లో కీలకమైన ఇంటీరియర్ సెక్రటరీ పదవికి డగ్ బర్గమ్‌ను ఎంపిక చేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ముఖ్యంగా బర్గమ్ భార్య క్యాథరిన్ చాలా అందంగా ఉండటం వల్లే ఆయనకు ఈ పదవి దక్కిందంటూ ట్రంప్ మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశంగా మారాయి.

ఓవల్ ఆఫీసులో అనూహ్య వ్యాఖ్యలు..

మాదకద్రవ్యాల కట్టడికి సంబంధించిన ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన అనంతరం.. ఓవల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో డగ్ బర్గమ్, ఆయన భార్య క్యాథరిన్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. “ఒకసారి డగ్, క్యాథరిన్ ఇద్దరూ గుర్రపు స్వారీ చేస్తున్న వీడియోను చూశాను. అందులో క్యాథరిన్ చాలా ఆకర్షణీయంగా కనిపించారు. ఆమె ఎవరని నా సిబ్బందిని ఆరా తీశాను. ఆ జంట గురించి తెలుసుకున్న తర్వాతే డగ్‌కు పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను” అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు.

ప్రతిభ కంటే ‘లుక్స్’కే ప్రాధాన్యతనా?

డగ్ బర్గమ్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాకుండా నార్త్ డకోటాకు రెండు సార్లు గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అయితే ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని పక్కన పెట్టి.. కేవలం ఆయన భార్య అందాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “డగ్ విజయం వెనుక ఆయన భార్య పాత్ర కచ్చితంగా ఉండి ఉంటుంది. వీరు నిజంగా అద్భుతమైన జంట” అంటూ ట్రంప్ సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. నియామకం వెనుక ఉన్న కారణం మాత్రం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

మహిళా సంఘాల ఆగ్రహం

ట్రంప్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఒక కీలక ప్రభుత్వ పదవిని కేటాయించేటప్పుడు అభ్యర్థి సామర్థ్యాన్ని కాకుండా వారి కుటుంబ సభ్యుల రూపూరేఖలను లెక్కలోకి తీసుకోవడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. గతంలోనూ ట్రంప్ మహిళల విషయంలో పలుమార్లు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారిక వేదికపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అమెరికా రాజకీయాల్లో మళ్లీ సంచలనం సృష్టిస్తోంది.

  Last Updated: 30 Jan 2026, 02:07 PM IST