Site icon HashtagU Telugu

China : డ్రాగన్ కంట్రీలో భారీగా కోవిడ్ కేసులు. ఒక్కరోజులో అత్యధికంగా..!

china

china

చైనాలో మరోసారి కోవిడ్ పంజా విసురుతోంది. ఇప్పటికే చైనాలో కఠినమైన జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేశారు. అయినప్పటికీ కేసులు మాత్రం భారీగా పెరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా నగరాల్లో లాక్ డౌన్ లు విధించారు. పాఠశాలలు సైతం మూతపడ్డాయి. చైనాలో ఒక్కరోజులోనే అత్యదిక కేసులు బయటపడ్డాయి. 31,454కేసులు నమోదు అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం నవంబర్ 20న 26,824 కేసులు నమోదు అయ్యాయి. బీజింగ్ లో ఆరు నెలల్లోనే కోవిడ్ తో ముగ్గురు మరణించారు.

అయితే కోవిడ్ నియంత్రణకు అక్కడి సర్కార్ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. దీన్ని సంక్రమరణ వ్యాప్తని అరికట్టేందుకు అవిశ్రాంతంగా క్రుషిచేస్తోంది. అయినప్పటికీ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. చాయాంగ్ లో దాదాపు 3.5మిలియన్ల మందిని ఇంట్లోనే ఉండాలని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు కోరారు. సోమవారం బీజింగ్ లో 14వందల కంటే ఎక్కువ కేసులను గుర్తించారు. చాయాంగ్ లోనే 783కేసులు నమోదు అయ్యాయి. 2019 చివరిలో కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుంచి బీజింగ్ లో ఒక్క రోజులో వెయ్యి కేసుల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారని స్థానిక మీడియా పేర్కొంది.

Exit mobile version