Site icon HashtagU Telugu

Brazil: ఆ దేశంలో భారీ వరదలు… పదుల సంఖ్యలో మరణాలు!

Brazil

Brazil

Brazil: బ్రెజిల్‌లో భారీ వరదలు వచ్చాయి. ఉత్తర సావోపా రాష్ట్రంలోని పలు నగరాల్లో ఈ వరదలు భీభ‌త్సం సృష్టించాయి. ఉత్తర సావోపా రాష్ట్రంలోని పలు నగరాల్లో ఈ వరదల ప్రలయానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పదలు సంఖ్యలో మృత్యువాత పడ్డారు.
ఒక్కసారిగా ఈ రాష్ట్రంలో వరదలు రావటంతో.. అక్కడి జనజీవనం స్తంభించిపోయింది.

 

ఈ వరదల్లో కనీసం 36 మంది సివిలియన్స్‌ మృతి చెందారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా భారీ వరదలు తగ్గుముఖం పట్టలేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బ్రెజిల్ అధికారులు ఆదివారం తెలిపారు. బ్రెజిల్‌లో ఎప్పుడు వచ్చేలా భారీ వర్షాలు ఈ సారి వచ్చినా… కొండ చరియలు విరిగిపడ్డంతో సాధారణ ప్రజలు చనిపోయారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారని, రెస్క్యూ టీంలు తీసేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ‌

 

అటు ఇంతలో, సావో సెబాస్టియో, బెర్టియోగా నగరాల్లో జరుపుకోవాల్సిన కార్నివాల్ పండుగ రద్దు చేశారు. తన నగరంలో జరిగిన ఘోర విధ్వంసానికి సంబంధించిన పలు వీడియోలను తన సోషల్ మీడియాలో బాధితులు పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు గొడుతున్నాయి.

 

ఒక్కరోజే ఈ ప్రాంతంలో 600 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. బ్రెజిల్ చరిత్రలో ఇంత తక్కువ సమయంలో కురిసిన భారీ వర్షపాతం ఇదేనని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో, బెర్టియోగా నగరంలో 687 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ప్రభుత్వం తెలిపింది.
ఈ జలప్రలయంలో ఇళ్లు అన్నీ నీటమునిగాయి. నిత్యవసర వస్తువులు అన్నీ తడిచిపోయాయి. పలుచోట్ల కొట్టుకుపోయినట్లు బాధితులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం యుద్ధ ప్రాతిపదిక సహాయ చర్యలు చేస్తోంది.