పాలస్తీనాలోని గాజా నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9మంది చిన్నారులతోపాటు మొత్తం 21 మంది మరణించారు. భారీ మొత్తంలో ఓ ఇంట్లో ఇంధనాన్ని నిల్వచేశారు. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో 21 మంది మంటల్లో చిక్కుకుని మరణించారని అధికారులు తెలిపారు.
An entire family, 21 people, died in an accidental burnt in Gaza tonight! 😭😭😭 pic.twitter.com/i0NhNEo92m
— S A R A H✌️🇵🇸 (@sarabahaa94) November 17, 2022
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో మొత్తం 21మంది మరణించినట్లు గాజా పౌర రక్షణ విభాగం ప్రకటించింది. అయితే అగ్రిప్రమాదానికి కారణం తెలియనప్పటికీ…భారీ మొత్తంలో ఇంట్లో ఇంధన నిల్వ చేయడమే దీనికి ప్రధానకారణమని సివిల్ డిఫెన్స్ యూనిట్ ప్రతినిధి తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అదించాలని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. కాగా 2.3 మిలియన్ల జనాభా ఉన్న గాజా 2007 నుంచి ఇజ్రాయెల్ దిగ్భంధనంలో ఉంది.