టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి నలుగురు మరణించారు. 35 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మీడియా నివేదికల ప్రకారం..సెంట్రల్ ఇస్తాంబుల్ తక్సిమ్ ప్రాంతంలో రద్దీగా ఉండే వీధిలో ఈ పేలుడు సంభవించింది. పర్యాటకులు స్థానికులతో రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుడు సంభవించింది. సాయంత్రం 4గంటలకు ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://twitter.com/AmichaiStein1/status/1591787584916803585?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1591787584916803585%7Ctwgr%5E275e7f9d1860cd6884431b17e119dc861081f919%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.hindustantimes.com%2Fworld-news%2Fturkey-blast-11-injured-as-explosion-rocks-istanbul-s-pedestrian-istiklal-avenue-report-101668347143524.html