Earthquake: న్యూజిలాండ్ లో భారీ భూకంపం. 7.3గా నమోదు. సునామీ హెచ్చరిక జారీ..!!

  • Written By:
  • Updated On - November 12, 2022 / 12:02 PM IST

న్యూజిలాండ్ భారీ భూకంపం సంభవించింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న టోంగాలో సాయంత్రం 6 గంటలకు భయంకరమైన భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 7.3గా నమోదు అయ్యింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం టోంగా నియాఫుకు తూర్పు ఆగ్నేయంగా 211 కి.మీ. లోతు ఈ భూ కంపం వచ్చ్చింది. దీంతో సముద్ర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రాణా నష్టం, ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం లేదు.

భూకంపం టోంగా దాని చుట్టూ ఉన్న అనేక దీవుల్లో సంభవించింది. దీంతో ప్రజలను సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఏడాది జనవరిలో సముద్రంలోని అగ్నిపర్వతం బద్దలైన సంగతి తెలిసిందే. ఇది వంద ఏళ్లలో అతిపెద్ద అగ్నిపర్వత విస్పోటనంగా ప్రకటించారు.