Site icon HashtagU Telugu

Earthquake: ఇరాన్, దుబాయ్ లో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు..!!

Uae

Uae

బుధవారం అర్థరాత్రి ఇరాన్, దుబాయ్ భూప్రకంపనలతో వణికిపోయాయి. దీనికి భూకంప కేంద్రం దక్షిణ ఇరాన్ లో ప్రాంతంలో ఉంది.  రిస్కర్ స్కేలుపై 5.6తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీని కారణంగా దుబాయ్ లోని అబుదాబిలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి.

దీని లోతు 9.8కి. మీ. బహ్రెయిన్ , సౌదీ అరేబియా, ఖతార్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనూ ప్రకంపలు సంభవించాయి. మరో వైపు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.