Earthquake : ఇండోనేషియాలో భారీ భూకంపం…61మంది మృతి..7వందల మందికి గాయాలు.!!

ఇండోనేషియాలోని జావాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు అయ్యింది. ఈ ఘటనలో 61మంది మరణించారు. 7వందల మంది గాయపడ్డారు. దాదాపు భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. Gempa bumi dengan magnitude (M)5,6 dirasakan warga Jakarta dan sekitarnya. Pusat gempa berada di darat 10 km barat daya Kabupaten Cianjur, Provinsi Jawa Barat. Fenomena ini terjadi pada Senin (21/11), pukul 13.21 WIB. […]

Published By: HashtagU Telugu Desk
Philippines

Earthquake 1 1120576 1655962963

ఇండోనేషియాలోని జావాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు అయ్యింది. ఈ ఘటనలో 61మంది మరణించారు. 7వందల మంది గాయపడ్డారు. దాదాపు భవనాలన్నీ నేలమట్టమయ్యాయి.

యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం…భూకంపం పశ్చిమ జావా ప్రావిన్స్ లోని సియాంజూర్ ప్రాంతానికి పదికిలో మీటర్ల దూరంలో కేంద్రీక్రుతమైందని తెలిపారు. సియాంజూర్ జిల్లాలో ఇళ్లు పెద్ద పెద్ద భవనాలు నేలమట్టమాయ్యాయని స్థానిక అధికారులు వెల్లడించారు. జకార్తా ప్రాంతంలోనూ బలమైన ప్రకంపనలు సంభవించినట్లు తెలిపారు.

రాజధాని జకార్తా సహా పరిసర ప్రాంతాల్లో భూకంపం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు భననాల్లో నుంచి జనాలను ఖాళీ చేయించారు. ఇంకా మ్రుతుల సంఖ్య అవకాశం ఉందని చెబుతున్నారు.

  Last Updated: 21 Nov 2022, 06:26 PM IST