Site icon HashtagU Telugu

Yemen Vs Israel : ఇజ్రాయెల్‌కు హౌతీ మిస్సైళ్ల వణుకు.. హౌతీలకు మిస్సైళ్లు ఇచ్చిందెవరు ?

Yemen Vs Israel Ballistic Missiles

Yemen Vs Israel : తాజాగా ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు ఇజ్రాయెల్ రాజధాని నగరం టెల్ అవీవ్ లక్ష్యంగా   యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించారు. అది దాదాపు 11 నిమిషాల్లో యెమన్ నుంచి ఇజ్రాయెల్‌కు చేరుకుంది. ఇజ్రాయెల్‌ ఆర్మీకి చెందిన ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థ కూడా దీన్ని ఆపలేకపోయింది. హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ కావడంతో దీన్ని ఆపడంలో ఐరన్ డోమ్ విఫలమైంది. సౌదీ అరేబియా, ఈజిప్టు, జోర్డాన్ గగనతల రక్షణ వ్యవస్థలు కూడా ఈ మిస్సైల్‌ను నిలువరించలేకపోయాయి. దీంతో ఆ మిస్సైల్ టెల్ అవీవ్‌లో పడి నష్టాన్ని క్రియేట్ చేసింది. లక్షలాది ఇజ్రాయెలీలు(Yemen Vs Israel) ఈ మిస్సైల్ భయంతో సొరంగాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఇంత భారీ మిస్సైల్ యెమన్ హౌతీల చేతికి ఎలా వచ్చింది ?

Also Read :Caste Column : ఈసారి జనగణన ఫార్మాట్‌లో ‘కులం’ కాలమ్.. కేంద్రం యోచన

పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ పలు మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇస్తోంది. లెెబనాన్‌లో హిజ్బుల్లా, పాలస్తీనాలో హమాస్, సిరియాలో ఫాతిమియున్ బ్రిగేడ్, ఇరాక్‌లో ఖతాయిబ్ హిజ్బుల్లా, యెమన్‌లో హౌతీలకు ఇరాన్ సైనిక సహకారాన్ని అందిస్తోంది. వాటికి డబ్బులు, ఆయుధాలను సమకూరుస్తోంది. తాజాగా హౌతీలు ప్రయోగించిన హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ కూడా ఇరాన్ నుంచే అంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే సిరియాలోని ఇరాన్ ఆయుధాల తయారీ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ ఆర్మీ దాడి చేసింది. బహుశా దానికి ప్రతీకారంగానే యెమన్ ద్వారా ఇజ్రాయెల్‌పైకి హైపర్ సోనిక్ మిస్సైల్‌ను  ఇరాన్ వేయించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read :Jammu Election : కశ్మీర్ ఎన్నికల్లో కాషాయ పార్టీ వ్యూహం ఏమిటో తెలుసా ?

అమెరికా, రష్యా (సోవియట్ యూనియన్) మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న టైంలో(1970లలో) ఆనాటి యెమెన్ ప్రభుత్వం సోవియట్ యూనియన్ నుంచి స్కడ్ క్షిపణులను కొనుగోలు చేసింది. గత కొన్నేళ్లలో రష్యాకు చెందిన ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ గ్రూప్, ఇరాన్ ఆర్మీల నుంచి కూడా ఆధునిక మిస్సైళ్లను యెమన్ హౌతీలు కొన్నారు. ఇరాన్ నుంచి సముద్ర మార్గంలో యెమన్‌కు మిస్సైళ్లు సప్లై అవుతుంటే అమెరికా, దాని సంకీర్ణ దళాలు మార్గం మధ్యలో అడ్డుకున్న సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన బుర్కాన్ మిస్సైళ్లు,  కుద్స్-1 , సయ్యద్-2సి మిస్సైళ్లు కూడా హౌతీల వద్ద ఉన్నాయని అంచనా. గతంలో మిస్సైళ్లతో సౌదీ అరేబియాపైనా హౌతీలు దాడి చేశారు.