Site icon HashtagU Telugu

DalaiLama: దలైలామా వారసుడిని ఎంపిక చేసే విషయంలో ఉద్రిక్తత, ఎలా ఎంపిక చేస్తారు?

DalaiLama

DalaiLama

DalaiLama: దలైలామా వారసుడిని ఎంపిక చేసే విషయంలో ఈ మధ్య భారత్- చైనా మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ అంశంపై భారత్ కఠిన వైఖరిని అవలంబిస్తుండగా.. చైనా కూడా వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా లేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజుఈ విషయంపై మాట్లాడుతూ.. వారసుడి నిర్ణయం కేవలం దలైలామా, టిబెట్‌ బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతుందని చెప్పారు. అయితే, చైనా మాత్రం తదుపరి దలైలామాను బీజింగ్ ఆమోదంతో టిబెట్‌లో ఎంపిక చేయాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య ఒక ట్రస్ట్ పేరు ఎక్కువగా చర్చలో నిలిచిందిజ‌ అది గదెన్ ఫోద్రాంగ్ ట్రస్ట్ (Gaden Phodrang Trust). నిజానికి, ఈ ట్రస్ట్ టిబెట్ బౌద్ధ ధర్మంలోని గెలుగ్ సంప్రదాయానికి చెందిన ఒక ముఖ్యమైన సంస్థ.

ఈ అంశం జులై 2న 14వ దలైలామా తెంజిన్ గ్యాట్సో తదుపరి దలైలామా ఎంపిక కేవలం గదెన్ ఫోద్రాంగ్ ట్రస్ట్ ద్వారానే జరుగుతుందని ప్రకటించడంతో మీడియాలోకి వచ్చింది. ఆయన తన ప్రకటనలో.. కొత్త దలైలామా ఎంపికలో ఎటువంటి బయటి వ్యక్తి, సంస్థ లేదా దేశం జోక్యం చేసుకునేందుకు అనుమతించబడదని స్పష్టం చేశారు. 1959 మార్చి 17న చీనా సైన్యం తిరుగుబాటు తర్వాత, 23 ఏళ్ల దలైలామా ల్హాసాను విడిచి వెళ్లారు. ఆ తర్వాత 1959 మార్చి 31న దలైలామా తన కొంతమంది సమర్థకులతో కలిసి భారత్‌లోకి ప్రవేశించారు.

Also Read: Vehicle Owners: జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి భారీ శుభవార్త!

గదెన్ ఫోద్రాంగ్ ట్రస్ట్ అంటే ఏమిటి? ఎలా కీలక పాత్ర పోషిస్తుంది?

వివరాల ప్రకారం.. గదెన్ ఫోద్రాంగ్ ట్రస్ట్‌ను 17వ శతాబ్దంలో 5వ దలైలామా న్గవాంగ్ లోబ్సాంగ్ గ్యాట్సో స్థాపించారు. ఆ సమయంలో ఈ ట్రస్ట్‌ను దలైలామా ఆధ్యాత్మిక, పరిపాలనా వారసత్వాన్ని కాపాడటానికి ఏర్పాటు చేశారని చెబుతారు. ఇప్పుడు ఈ ట్రస్ట్ దలైలామా వారసుడి ఎంపికలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. నిజానికి, గెలుగ్ సంప్రదాయంలోని సీనియర్ లామాలు, గదెన్ ఫోద్రాంగ్ ట్రస్ట్ సభ్యులు సంకేతాలు, దర్శనాల ద్వారా కొత్త దలైలామాను గుర్తిస్తారు.

జులై 6న దలైలామా 90వ జన్మదిన వేడుకలు

కొత్త దలైలామా లేదా ఆయన పునర్జన్మ గుర్తింపు కోసం మొదట కొంతమంది సంభావ్య పిల్లలను గుర్తిస్తారు. ఈ పిల్లల గుర్తింపు మునుపటి దలైలామాకు చెందిన వస్తువులను గుర్తించడం, ప్రార్థన మాల వంటి సంకేతాల ద్వారా గెలుగ్ సంప్రదాయంలోని సీనియర్ లామాలు చేస్తారు. ఈ పిల్లల ఎంపిక పూర్తిగా టిబెట్ బౌద్ధ విశ్వాసాల ప్రకారం జరుగుతుంది. వివరాల ప్రకారం.. భారత్‌లో గదెన్ ఫోద్రాంగ్ ట్రస్ట్ ఆశ్రమం లేదా కార్యాలయం ధర్మశాలలో ఉంది. జులై 6న దలైలామా 90వ జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఈ రోజున వారసుడికి సంబంధించి ఏదైనా ప్రకటన జరిగే అవకాశం ఉంది. అయితే, ఇప్పటివరకు ట్రస్ట్ నుండి ఈ విషయంపై ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.

గదెన్ ఫోద్రాంగ్ ట్రస్ట్

వివరాల ప్రకారం.. గదెన్ ఫోద్రాంగ్ ట్రస్ట్‌ను టిబెట్ బౌద్ధ ధర్మ స్వాయత్తత ప్రతీకంగా పరిగణిస్తారు. ఇది టిబెట్ సమాజం ధార్మిక, సాంస్కృతిక గుర్తింపును కాపాడే పనిని చేస్తోంది. ఇది టిబెట్ ధార్మిక సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు, దేశాలు, సంస్థల నుండి దానిని రక్షించే పనిని చేస్తోంది.