Hair Transplant Capital : బట్టతల సమస్య చాలామందిని వేధిస్తుంటుంది. కొందరు దీనికి వెంటనే చికిత్స చేయిస్తుంటారు. ఇంకొందరు ఏం కాదులే అని వదిలేస్తుంటారు. మంచి ఆదాయం కలిగిన వారు, ఆస్తిపరులు బట్టతల నుంచి గట్టెక్కేందుకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీని చేయించుకుంటారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడరు. హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లోని ఆస్పత్రుల్లోనూ ఇప్పుడు ఇలాంటి సర్జరీలు జరుగుతున్నాయి. మెడికల్ టూరిజం మన హైదరాబాద్‌లో బాగానే పెరుగుతోంది. వివిధ దేశాల ప్రజలు వచ్చి హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు పొందుతున్నారు. బట్టతల చికిత్స విషయానికి వస్తే ప్రపంచంలోనే నంబర్ 1 దేశమేదో మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Rahul Gandhi : కాంగ్రెస్‌లోని బీజేపీ ఏజెంట్లను ఫిల్టర్ చేస్తాం : రాహుల్
ఇస్తాంబుల్‌కు క్యూ.. ఎందుకు ?
అగ్రరాజ్యం అమెరికా నుంచి మొదలుకొని, తెల్లదొరల బ్రిటన్ దాకా చాలా దేశాల్లో బట్టతల కలిగిన వారు చికిత్స కోసం ఇప్పుడు ఒక దేశం వైపు చూస్తున్నారు. అదే టర్కీ (తుర్కియే). ఈ దేశంలోని ఇస్తాంబుల్ నగరం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలకు ఖ్యాతిని గడించింది. ఇంతకీ ఎందుకు ? అంటే.. ఇస్తాంబుల్‌లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన క్లినిక్‌లు ఉన్నాయి. ఇక్కడి డాక్టర్లకు చాలా అనుభవం ఉంది. బట్టతల కలిగిన వారికి ఎంతో నమ్మకంగా చికిత్సను అందిస్తారు. ఈ సర్జరీకి అయ్యే ఖర్చు కూడా ఇతర దేశాల కంటే చాలా తక్కువ. అందుకే ఇతర దేశాల బట్టతల వారు ఇస్తాంబుల్‌కు క్యూ కడుతున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేశాక తలపై బ్యాండేజీలు కడతారు. ఈ విధమైన బ్యాండేజీలు కనిపించిన ఎంతోమంది నిత్యం టర్కీ దేశంలోని ఎయిర్‌పోర్టులలో కనిపిస్తుంటారు. వీళ్లంతా బట్టతల చికిత్స చేయించుకున్న వారే. ఈవిధంగా మెడికల్ టూరిజం పెరగడానికి టర్కీ(Hair Transplant Capital) ప్రభుత్వం కూడా తనవంతు సహకారాన్ని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ క్లినిక్‌లకు అందిస్తోంది. వాటి నిర్వాహకులకు రుణాలు, పన్ను రాయితీలను అందిస్తోంది.
Also Read :Lalit Modi : వనౌతులో సెటిల్ కానున్న లలిత్ మోడీ.. ఆ దేశం విశేషాలివీ
రెండు రకాల సర్జరీలు..
బట్టతల కలిగిన వారికి చేసే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు ప్రధానంగా రెండు రకాలు. వీటిలో మొదటి దాన్ని ‘ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్‌ట్రాక్షన్’ (FUE) అంటారు. ఈ పద్ధతిలో ప్రతి ఒక్క జుట్టు మూలాన్ని తొలగించి, బట్టతల ప్రాంతంలో అమరుస్తారు. దీనివల్ల తలపై చాలా తక్కువ సంఖ్యలో మచ్చలు ఏర్పడతాయి. మరో సర్జరీ పద్ధతి పేరు.. ‘ఫోలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ (FUT). ఈ పద్ధతిలో తలపై జుట్టు ఉన్న ప్రాంతం నుంచి స్కిన్ స్ట్రిప్‌ను సేకరిస్తారు. దాన్ని చిన్న భాగాలుగా విభజించి బట్టతల ప్రాంతంలో అమరుస్తారు.