Site icon HashtagU Telugu

US vs Houthi : అమెరికా వార్నింగ్ తూచ్.. ఎర్రసముద్రంలో హౌతీలు తొలిసారి ఏం చేశారంటే..

Us Vs Houthi

Us Vs Houthi

US vs Houthi : అగ్రరాజ్యం అమెరికా వార్నింగ్‌ను కూడా యెమన్ హౌతీ మిలిటెంట్లు పెడచెవిన పెడుతున్నారు. ఎర్ర సముద్రంలో యథేచ్ఛగా చెలరేగుతున్నారు. తొలిసారిగా గురువారం రోజు డ్రోన్ పడవతో హౌతీలు దాడికి పాల్పడ్డారు. ఎర్ర సముద్రంలో ఇతర వాణిజ్య నౌకలకు అమెరికా యుద్ధనౌకలు పహారా కాస్తున్న ప్రదేశం సమీపంలోకి డ్రోన్ పడవను పంపి హౌతీలు పేల్చేశారు. డ్రోన్ పడవ పేలుడు పదార్థాలతో నిండి ఉందని.. అది తమ నౌకలకు కొంతదూరంలోకి వచ్చి పేలిందని అమెరికా ఆర్మీ వెల్లడించింది. తమ నౌకల నుంచి కేవలం 2 మైళ్ల దూరంలోనే ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఎర్ర సముద్రంలో దాదాపు 80 కిలోమీటర్ల లోపలి ఏరియాలో ఇదంతా చోటుచేసుకుందని వివరించింది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు అమెరికా, బ్రిటన్, జపాన్ సహా మొత్తం 12 దేశాలు యెమన్ హౌతీల స్థావరాలపై వైమానిక దాడులు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఎర్ర సముద్రంలో ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలకు హౌతీలు విఘాతం కలిగిస్తున్నారని ఈ దేశాలు ఆరోపిస్తున్నాయి. గాజాపై ఇజ్రాయెల్  వైమానిక దాడుల్లో 21వేల మందికిపైగా అమాయక పౌరులు చనిపోయారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపేస్తే.. తాము కూడా ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులను ఆపేస్తామని యెమన్ హౌతీలు అల్టిమేటం ఇస్తున్నారు. ఈ డిమాండ్‌కు ఇజ్రాయెల్‌ను ఒప్పించే సాహసం చేయలేని అమెరికా, బ్రిటన్‌లు.. యెమన్ హౌతీలపై కూడా గాజా తరహా దాడులు చేసేందుకు రెడీ అవుతున్నాయి. దీన్నిబట్టి యుద్ధోన్మాదం ఏయే దేశాలకు ఉందో యావత్ ప్రపంచానికి స్పష్టంగా(US vs Houthi) తెలిసిపోతోంది.

Also Read: Jeffrey Epstein : దేశాల అధ్యక్షులే కస్టమర్లు.. ప్రైవేటుదీవిలో వ్యభిచార దందా.. జెఫ్రీ ఎప్స్టీన్ చిట్టా