UK : హిందువులు తెలివైనవారు..వారిది మంచి ప్రవర్తన: యూకే దినపత్రిక

  • Written By:
  • Updated On - November 1, 2022 / 08:48 AM IST

భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటు భారతీయులు,అటు లండన్ లో ఉన్న హిందూవులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన ఓ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. బ్రిటన్ హిందూవులు చాలా తెలివైనవారు..సంపన్నులు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారంటూ పేర్కొంది. ఈ మధ్యే హిందూ ముస్లిం ఘర్షణలపై స్వతంత్ర విచారణ ప్రారంభించిన తర్వాత యూకే ఆధారిత దినపత్రికలో ఒక నివేదిక పేర్కొంది.

ఆదివారం విడుదల చేసిన టైమ్స్ నివేదిక…భారతీయులను ప్రశంసించింది. బ్రిటన్ జైళ్లలో కేవలం 329 మంది హిందువులు మాత్రమే ఉన్నారని పేర్కొంది. ఏ మత సమూహంలోనైనా అతి తక్కువ మంది హిందువులు మాత్రమే ఉన్నారని.. వారు క్రైస్తవుల కంటే మెరుగ్గా, ఎక్కువ సంపాదిస్తున్నారని పేర్కొంది. ఇటీవలి జనాభా లెక్కల ప్రకారం 15.4 శాతం మంది బ్రిటీష్ భారతీయులు, వీరిలో 50 శాతం మంది హిందువులు వృత్తిపరమైన, నిర్వాహక బాధ్యతల్లో ఉన్నారు. ఇది ఏ సమూహంలోనైనా అత్యధిక నిష్పత్తిలో ఉందని నివేదిక పేర్కొంది. అంతేకాదు బ్రిటిష్ హిందువుల్లో 95శాతంమంది మంచి ఉన్నత విద్యను కలిగి ఉన్నారని నివేదించింది. దాదాపు ఇది 30శాతం క్రైస్తవుల కంటే రెట్టింపు.

ఇది కూడా చదవండి : మహ్సా అమిని తర్వాత…పోలీస్ కస్టడీలో 19ఏళ్ల యువకుడు మృతి..!!

2012 నాటికి, లండన్‌లో నివసిస్తున్న హిందువుల నికర విలువ £277,400 (ఆస్తులతో సహా)గా ఉండేది. ఇప్పుడు ఆ దేశపు భారత సంతతి ప్రధాన మంత్రి రిషి సునక్, అతని భార్య అక్షతా మూర్తి మాత్రమే 730 మిలియన్ పౌండ్‌లు ($844 మిలియన్లు) ఉన్నట్లు అంచనా వేసింది. వీరి నికర విలువ రాజు చార్లెజ్ వ్యక్తిగత సంపద కంటే దాదాపు రెండింతలు ఎక్కువ. యూకే దినపత్రిక ప్రచురించిన ఈ నివేదికపై పంజాబ్‌కు చెందిన లార్డ్ రామి రేంజర్ CBE స్పందిస్తూ, “మనల్ని శాంతియుతంగా, సుసంపన్నంగా, ప్రగతిశీలంగా మార్చే భారతీయ విలువలకు గొప్ప నివాళి” అంటూ ట్వీట్ చేశారు.
“బ్రిటీష్ హిందువులు సహకరిస్తారు. హిందూమతంచే పరిపాలించబడే కృషి, ఐక్యతపై నమ్మకం ఉంచండి..” అంటూ UK ఆధారిత హిందూ గ్రూప్ ఇన్‌సైట్ ట్వీట్ చేసింది.

ఆగస్ట్‌లో భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత ఈస్ట్ లీసెస్టర్ ఘర్షణలపై నగర మేయర్ పీటర్ సోల్స్‌బీ దర్యాప్తును బహిష్కరించాలని UKలోని 15 ఇతర హిందూ సంస్థలతో పాటు ఈ బృందం ముందంజలో ఉంది. విద్వేషషాలను రెచ్చగొట్టే డాక్టర్ క్రిస్ అలెన్‌ను ప్రోబ్ ప్యానెల్‌కు అధిపతిగా నియమించడం పట్ల చాలా మంది హిందువులు అసంతృప్తిగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఇక టైమ్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఇంగ్లండ్, వేల్స్ లో 983,000 మంది హిందువులు నివసిస్తున్నారు. 47 శాతం బ్రిటిష్ హిందువులు లండన్‌లో నివసిస్తున్నారు.