Pakistan: పాకిస్థాన్ లో హిందూ మహిళపై దాడి..!!

పాకిస్థాన్ లో హిందూమహిళలపై దాడి తీవ్ర ఉద్రికత్తకు దారి తీసింది. దొంగతనం చేసిందన్న నేపంతో మహిళపై దాడి చేశారు.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 05:45 AM IST

పాకిస్థాన్ లో హిందూమహిళలపై దాడి తీవ్ర ఉద్రికత్తకు దారి తీసింది. దొంగతనం చేసిందన్న నేపంతో మహిళపై దాడి చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ మైనార్టీలు ఆందోళణ చేపట్టారు. స్థానిక మీడియా ప్రకారం, మైనారిటీ హిందువులపై జరిగిన అకృత్యాలకు వ్యతిరేకంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం, బహవల్‌పూర్‌లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వెలుపల పెద్దసంఖ్యలో ఆందోళన చేపట్టారు.

హిందూ మహిళపై తప్పుడు ఆరోపణలు చేసి దాడి చేశారని నిరసనకారులు తెలిపారు. బాధితురాలు యజ్మాన్ మండి ప్రాంతంలో నివాసం ఉంటూ ఇళ్లలో పనిచేస్తోంది. ఆమె దొంగతనం చేసిందన్న నెపంతో కొంతమంది వ్యక్తులు ఇంటిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలైన మహిళను స్థానికఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చికిత్స చేసేందుకు నిరాకరించారని నిరసనకారులు ఆరోపించారు. కిడ్నాప్‌లు, హత్యలు, బలవంతపు మతమార్పిడులతో సహా పాకిస్థాన్‌లో మైనారిటీల దుస్థితి ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్‌లో మహిళలు, మైనారిటీలపై హింసాత్మక కేసులు పెరుగుతున్నాయి.