Site icon HashtagU Telugu

Hezbollah Unit 910 : రంగంలోకి హిజ్బుల్లా ‘యూనిట్ 910’.. ఇజ్రాయెల్‌‌లో హైఅలర్ట్‌

Hezbollah Unit 910 Israel Jewish Communities

Hezbollah Unit 910 : లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా ఇటీవలే బీరుట్ నగరంపై ఇజ్రాయెల్ దాడుల్లో మరణించాడు. దీంతో తదుపరిగా ఏం జరగబోతోంది ? నస్రల్లా మరణంతో హిజ్బుల్లా పని అయిపోయినట్టేనా? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. అయితే ఈ పరిణామంతో ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా మరింత తీవ్రంగా దాడులు చేసే ముప్పు ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక హిజ్బుల్లాకు చెందిన ‘యూనిట్ 910’ అనే కోవర్ట్ విభాగం రంగంలోకి దిగి దాడులు మొదలుపెట్టే ముప్పు ఉందని అంటున్నారు.

Also Read :Apples – Drugs : యాపిల్స్ మాటున డ్రగ్స్ దందా.. అడ్డంగా దొరికిపోయిన వ్యాపారి

ప్రపంచవ్యాప్తంగా యూదులను లక్ష్యంగా చేసుకొని యూనిట్ 910 దాడులు చేయొచ్చని చెబుతున్నారు. 3 దశాబ్దాల కిందట ఆనాటి హిజ్బుల్లా కీలక నేత అబ్బాస్‌ అల్‌ ముసావిని ఇజ్రాయెల్‌ దళాలు మట్టుబెట్టాయి. అప్పట్లో ఈ హత్యకు ప్రతీకారంగా హిజ్బుల్లాకు చెందిన యూనిట్ 910(Hezbollah Unit 910) ప్రతీకార దాడులకు పాల్పడింది. లెబనాన్ బయట ఇజ్రాయెలీలు, యూదులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడమే ఈ యూనిట్ 910 పని. దీనికి హిజ్బుల్లా నేత తలాల్‌ హమియా అలియాస్‌ అబు జాఫర్‌ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఇజ్రాయెలీ గూఢచార సంస్థ మోసాద్ కూడా ఈవిధమైన దాడులు చేయడంలో చాలా ఫాస్ట్. ఇటీవలే లెబనాన్‌లో పేజర్లు, వాకీ టాకీలు, సోలార్ ప్యానళ్లు పేలడం వెనుక మోసాద్ హస్తం ఉంది. ఆ పేలుళ్లలో 3200 మందికిపైగా గాయపడగా.. దాదాపు 32 మంది చనిపోయారు. ఈ దాడులకు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని యూనిట్ 910 భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read :Naked Trump Statue : ట్రంప్ నగ్న విగ్రహం వైరల్.. 43 అడుగుల పొడవు.. 2720 కేజీల బరువు